Share News

మండుతున్న కూరగాయల ధరలు

ABN , Publish Date - Oct 04 , 2026 | 12:33 AM

కూరగాయల ధరలు మండిపోతున్నాయి. పేద, మధ్యతరగతి వర్గాలకు అందుబాటులో లేకుండాపోయాయి. టమాటా ధర మోతెక్కిస్తోంది. ఉల్లి ఘాటు ఇంకా తగ్గలేదు.

మండుతున్న కూరగాయల ధరలు
కూరగాయలు

- ఘాటెక్కిన ఉల్లి

- వారం రోజుల వ్యవధిలో కిలోకు రూ.25లు పెరిగిన టమాటా

- చిక్కుడు, బీన్స్‌ రూ.120, అల్లం రూ.160

నర్సీపట్నం, అక్టోబరు 3(ఆంధ్రజ్యోతి): కూరగాయల ధరలు మండిపోతున్నాయి. పేద, మధ్యతరగతి వర్గాలకు అందుబాటులో లేకుండాపోయాయి. టమాటా ధర మోతెక్కిస్తోంది. ఉల్లి ఘాటు ఇంకా తగ్గలేదు.

ఉల్లిపాయల ధర ఆగస్టు నుంచి పెరగడమే గాని తగ్గిన పాపాన పోలేదు. ప్రస్తుతం పెద్ద సైజు ఉల్లిపాయలు కిలో రూ.65లకు, చిన్నవి రూ.50లకు విక్రయిస్తున్నారు. టమాటా గత శనివారం మార్కెట్లో రూ.25లు ఉంటే ఈ వారం ఒకేసారి రూ.50లకు పెరిగింది. చిక్కుడు కాయలు, బీన్స్‌ కిలో రూ.120 చొప్పున విక్రయించారు. అల్లం రూ.160, దొండ, బెండ, బీరకాయలు కిలో రూ.60 చొప్పున విక్రయించారు. చేమదుంపలు కిలో రూ.50లకు, కాలీఫ్లవర్‌ కిలో రూ.60, క్యాబేజీ రూ.50లకు అమ్ముతున్నారు. రెండేసి కిలోల చొప్పున ఉల్లిపాయలు, టమాటాలు కొనుగోలు చేసి వారానికి సరిపడా అర కిలో చొప్పున కూరగాయల కొనాలంటే రూ.400 నుంచి రూ.500 అవుతుందని సామాన్య ప్రజలు వాపోతున్నారు. ఒక పక్క బియ్యం, వంటనూనెలు, నిత్యావసర ధరలు పెరిగి తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్న పేద, మధ్యతరగతి ప్రజలకు ఆకాశాన్ని తాకుతున్న కూరగాయల ధరలు గోరుచుట్టు మీద రోకలి పోటు మాదిరిగా తయారైందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Oct 04 , 2026 | 12:33 AM