కమ్మేసిన మంచు
ABN , Publish Date - Nov 15 , 2026 | 11:54 PM
మారుతున్న వాతావరణం నేపథ్యంలో మన్యంలో దట్టంగా మంచు కమ్మేసింది. ఏజెన్సీలో ఆదివారం తెల్లవారుజాము నుంచి ఉదయం పది గంటల వరకు మంచు దట్టంగా కమ్మేయడంతో రోడ్డు సరిగా కన్పించక వాహనదారులు లైట్లు వేసుకుని రాకపోకలు సాగించారు.
ఉదయం పది గంటల వరకు కురవడంతో రాకపోకలకు ఇబ్బందులు
స్థిరంగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు
అరకులోయలో 12.3 డిగ్రీలు
పాడేరు, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): మారుతున్న వాతావరణం నేపథ్యంలో మన్యంలో దట్టంగా మంచు కమ్మేసింది. ఏజెన్సీలో ఆదివారం తెల్లవారుజాము నుంచి ఉదయం పది గంటల వరకు మంచు దట్టంగా కమ్మేయడంతో రోడ్డు సరిగా కన్పించక వాహనదారులు లైట్లు వేసుకుని రాకపోకలు సాగించారు. ఉదయం దట్టంగా మంచు మఽధ్యాహ్నం ఒక మోస్తరు ఎండ సాయంత్రం నాలుగు గంటల నుంచి శీతల వాతావరణం కొనసాగింది. దీంతో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. కొయ్యూరులో ఆదివారం 16.1, హుకుంపేటలో 15.7, పాడేరులో 15.6, జి.మాడుగులలో 14.7, జీకేవీధిలో 14.8, చింతపల్లిలో 13.8, పెదబయలులో 13.4, ముంచంగిపుట్టులో 13.2, డుంబ్రిగుడలో 12.7, అరకులోయలో 12.3 డిగ్రీల సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ముంచంగిపుట్టులో..
మండల పరిధిలో చలి తీవ్రత రోజు రోజుకు అధికమవుతోంది. ఆదివారం మండల కేంద్రంలో ఉదయం 9 గంటల వరకు మంచు దట్టంగా కమ్ముకుంది. ఉదయం వేళల్లో మార్నింగ్ వాకింగ్‌కు వెళ్లేవారు, వివిధ పనుల నిమిత్తం బయటకు వచ్చేవారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సాయంత్రం ఐదు గంటల నుంచే చలి ప్రజలను భయపెడుతోంది. చలి నుంచి రక్షణ పొందేందుకు ప్రజలు ఆపసోపాలు పడుతున్నారు. గ్రామాల్లో సాయంత్రం నుంచి ప్రజలు చలి మంటలు కాగుతున్నారు.