Share News

మన్యంపై మంచు తెర

ABN , Publish Date - Mar 23 , 2026 | 11:27 PM

మన్యంలో శీతాకాలాన్ని తలపించేలా పొగమంచు తీవ్రత కొనసాగుతున్నది. ప్రస్తుత వేసవి కాలంలోనూ శీతాకాలాన్ని తలపించేలా పాడేరుతో సహా పలు మండలాల్లో సోమవారం ఉదయం తొమ్మిది గంటల వరకు దట్టంగా పొగమంచు కమ్మేసింది.

మన్యంపై మంచు తెర
పాడేరు మెయిన్‌రోడ్డులో సోమవారం ఉదయం పొగమంచు

దట్టంగా పొగమంచు

ముంచంగిపుట్టులో 13.4 డిగ్రీలు

పాడేరు, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): మన్యంలో శీతాకాలాన్ని తలపించేలా పొగమంచు తీవ్రత కొనసాగుతున్నది. ప్రస్తుత వేసవి కాలంలోనూ శీతాకాలాన్ని తలపించేలా పాడేరుతో సహా పలు మండలాల్లో సోమవారం ఉదయం తొమ్మిది గంటల వరకు దట్టంగా పొగమంచు కమ్మేసింది. పొగమంచు ప్రభావానికి వాహనాలు లైట్లు వేసుకుని రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత కొన్ని రోజులుగా వాతావరణంలోని మార్పులతో ఏజెన్సీలో విభిన్నమైన వాతావరణం నెలకొంటున్నది. అలాగే కనిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నప్పటికీ రాత్రి వేళల్లో చలి ప్రభావం చూపుతున్నది.

కొనసాగుతున్న కనిష్ఠ ఉష్ణోగ్రతలు

మన్యంలో కనిష్ట ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరుగుతున్నాయి. సోమవారం ముంచంగిపుట్టులో 13.4, అరకులోయలో 13.9, పెదబయలులో 15.3, డుంబ్రిగుడలో 15.4, చింతపల్లిలో 18.1, జి.మాడుగులలో 18.5, కొయ్యూరులో 19.5, అనంతగిరిలో 19.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Updated Date - Mar 23 , 2026 | 11:27 PM