Share News

మన్యంపై మంచు ముసుగు

ABN , Publish Date - Feb 10 , 2026 | 12:07 AM

మన్యంలో పొగమంచు కొనసాగుతున్నది. మన్యంలో సోమవారం జి.మాడుగుల, కొయ్యూరు మండలాల్లో మినహా మిగతా ప్రాంతాల్లో సింగిల్‌ డిజిట్‌లోనే కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

మన్యంపై మంచు ముసుగు
పాడేరు- జి.మాడుగుల మెయిన్‌రోడ్డులో సోమవారం ఉదయం దట్టంగా కమ్మేసిన పొగమంచు

తగ్గని చలి తీవ్రత

అరకులోయ 7.8 డిగ్రీలు

పాడేరు, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): మన్యంలో పొగమంచు కొనసాగుతున్నది. మన్యంలో సోమవారం జి.మాడుగుల, కొయ్యూరు మండలాల్లో మినహా మిగతా ప్రాంతాల్లో సింగిల్‌ డిజిట్‌లోనే కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో చలి ప్రభావం చూపుతున్నది. పాడేరులో సోమవారం తెల్లవారుజాము నుంచి పది గంటల వరకు ఎదుట వ్యక్తులు కనిపించని విధంగా దట్టంగా పొగమంచు కమ్మేసింది. దీంతో వాహనాలు హెడ్‌ లైట్లు వేసుకుని రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

కొనసాగుతున్న కనిష్ఠ ఉష్ణోగ్రతలు

మన్యంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. అరకులోయలో 7.8, హుకుంపేటలో 8.2, ముంచంగిపుట్టులో 8.9, పెదబయలులో 9.2, చింతపల్లిలో 9.5, జి.మాడుగులలో 11.5, కొయ్యూరులో 12.7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Updated Date - Feb 10 , 2026 | 12:07 AM