Share News

పాఠశాలల అభివృద్ధికి ఎస్‌ఎంసీలు దోహదం

ABN , Publish Date - Sep 30 , 2026 | 12:31 AM

స్కూల్‌ యాజమాన్య కమిటీ(ఎస్‌ఎంసీ)లు పాఠశాలల అభివృద్ధికి దోహదపడతాయని కలెక్టర్‌ టి.నిషాంతి అన్నారు. పాడేరులోని గుడివాడ మండల పరిషత్‌ ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో మంగళవారం జరిగిన స్కూల్‌ యాజమాన్య కమిటీ ఎన్నికను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు.

పాఠశాలల అభివృద్ధికి ఎస్‌ఎంసీలు దోహదం
పాడేరులోని గుడివాడ స్కూల్‌లో మాట్లాడుతున్న కలెక్టర్‌ టి.నిషాంతి, పక్కన డీఈవో భానుమూర్తి

- కలెక్టర్‌ టి.నిషాంతి

పాడేరు, సెప్టెంబరు 29(ఆంధ్రజ్యోతి): స్కూల్‌ యాజమాన్య కమిటీ(ఎస్‌ఎంసీ)లు పాఠశాలల అభివృద్ధికి దోహదపడతాయని కలెక్టర్‌ టి.నిషాంతి అన్నారు. పాడేరులోని గుడివాడ మండల పరిషత్‌ ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో మంగళవారం జరిగిన స్కూల్‌ యాజమాన్య కమిటీ ఎన్నికను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. కమిటీలు పాఠశాలల్లో స్థితిగతులను పరిశీలించడంతో పాటు పాఠశాల అభివృద్ధికి తమవంతు కృషి చేయాలని కలెక్టర్‌ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎస్‌ఎంసీ చైర్మన్‌గా అన్నంరెడ్డి సావిత్రి, వైస్‌చైర్మన్‌గా పాంగి కృష్ణ, సుమారు 15 మంది సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన ఎస్‌ఎంసీతో మండల విద్యాశాఖాధికారి బి.విశ్వనాఽథం ప్రమాణ స్వీకారం చేయించారు.

విద్యార్థులతో కలెక్టర్‌ మమేకం

గుడివాడ స్కూల్లో ఎస్‌ఎంసీ ఎన్నికలు అనంతరం కలెక్టర్‌ టి.నిషాంతి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. తర్వాత విద్యార్థులకు ఆమె స్వయంగా ఆహార పదార్ధాలు వడ్డించి, ఆమె కూడా వారితో కలిసి భోజనం చేశారు. అనంతరం విద్యార్థులందర్నీ ఆమె పలకరించడంతో వారంతా ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి భానుమూర్తిరాజు, మండల విద్యాశాఖాధికారులు బి.విశ్వనాథం, సీహెచ్‌ సరస్వతి, పాఠశాల హెచ్‌ఎం కె.రామ్మూర్తినాయుడు, సీఆర్‌పీ హిమబిందు, విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Updated Date - Sep 30 , 2026 | 12:31 AM