Share News

ప్రశాంతంగా ఎస్‌ఎంసీ ఎన్నికలు

ABN , Publish Date - Sep 30 , 2026 | 12:38 AM

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ‘స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ’ (ఎస్‌ఎంసీ) ఎన్నికల ప్రక్రియ చెదురుమదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 1,432 పాఠశాలల్లో ఎస్‌ఎంసీ ఎన్నికలు నిర్వహించగా.. 1,064 పాఠశాలల్లో కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ప్రశాంతంగా ఎస్‌ఎంసీ ఎన్నికలు
చోడవరం పట్టణంలోని కొత్తూరు బాలికల ఉన్నత పాఠశాల ఎన్నికల్లో చేతులెత్తి ఆమోదం తెలుపుతున్న తల్లిదండ్రులు

1,402 పాఠశాలలకుగాను 1,064 పాఠశాలల్లో కమిటీలు ఏకగ్రీవం

338 పాఠశాలల్లో ఓటింగ్‌...

అక్కడక్కడా చెదురుమదురు సంఘటలు

కోరం లేకపోవడం, గొడవల కారణంగా 30 పాఠశాలల్లో ఎన్నికలు వాయిదా

అనకాపల్లి, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి- న్యూస్‌ నెట్‌వర్క్‌): జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ‘స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ’ (ఎస్‌ఎంసీ) ఎన్నికల ప్రక్రియ చెదురుమదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 1,432 పాఠశాలల్లో ఎస్‌ఎంసీ ఎన్నికలు నిర్వహించగా.. 1,064 పాఠశాలల్లో కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 338 పాఠశాలల్లో ఓటింగ్‌ జరపాల్సి వచ్చింది. 30 పాఠశాలల్లో కోరం లేకపోవడం లేదా గొడవలు జరగడంతో ఎన్నికలను వాయిదా వేశారు. ఎన్నికల ప్రక్రియ ముగిసిన తరువాత కొత్త కమిటీలతో అధికారులు ప్రమాణ స్వీకారం చేయించి, తొలి సమావేశాలను నిర్వహించారు. నిబంధనల ప్రకారం ఎస్‌ఎంసీ ఎన్నికలను నిర్వహించినట్టు సమగ్ర శిక్ష ఏపీసీ శ్రీరాములు తెలిపారు. ఎన్నికలు వాయిదా పడిన పాఠశాలల్లో ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం త్వరలో ఎన్నికలు నిర్వహిస్తామన్నారు.

గొడవలు, ఘర్షణలతో ఎన్నికలు వాయిదా

బుచ్చెయ్యపేట మండలం వడ్డాది కేజేబీవీ ఎస్‌ఎంసీ ఎన్నికలకు రాజకీయ రంగు పులుముకుంది. కోరం మేరకు ఓటర్లు (తల్లిదండ్రులు) హాజరయ్యారు. ఎన్నికల ప్రక్రియ మొదలైన తరువాత తల్లిదండ్రులు రాజకీయ పార్టీల వారీగా (కూటమి, వైసీపీ) విడిపోయి గొడవ పడ్డారు. ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో సమాచారం అందుకున్న పోలీసులు కేజీబీవీ వద్దకు చేరుకొని పరిస్థితిని అదుపు చేశారు. అందరినీ అక్కడ నుంచి పంపించి వేయడంతో అధికారులు ఎన్నికలను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. ఇదే మండలంలోని పంగిడి ప్రాథమిక పాఠశాలలో తల్లిదండ్రులతోపాటు కూటమి, వైసీపీ మద్దతుదారులు లోపలికి రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో ఎంఈవో గీత ఎన్నికలను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. ఆర్‌.భీమవరంలో శాంతి భద్రతలను దృష్టిలో ఎస్‌ఎంసీ ఎన్నికలను వాయిదా వేశారు.

గొలుగొండ మండలం చీడిగుమ్మల ఉన్నత పాఠశాల ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ మద్దతుదారులు పోటీ పడడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎన్నికలను వాయిదా వేసినట్టు ఎంఈవో-2 సత్యనారాయణ ప్రకటించారు.

పాయకరావుపేట మండలం పాల్తేరు ఎంపీపీ పాఠశాల, సత్యవరం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులు రెండు వర్గాలుగా విడిపోయి గొడవకు దిగారు. దీంతో పోలీసులు వచ్చి చెదరగొట్టారు. ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఈ రెండు పాఠశాలల్లో ఎస్‌ఎంసీ ఎన్నికలు వాయిదా పడ్డాయి.

కోరం లేకపోవడంతో..

కోరం చాలకపోవడంతో కశింకోట జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాల, తేగాడ మెడల్‌ స్కూలు, బుచ్చెయ్యపేట మండలం వడ్డాది, సీతయ్యపేట, కోటవురట్ల మండలం కొడవటిపూడి జడ్పీ ఉన్నత పాఠశాల, సన్యాసిరాజుపాలెం ప్రాథమిక పాఠశాల, మాకవరపాలెం మండలం లచ్చన్నపాలెం, నాతవరం మండలం డి.యర్రవరం, చమ్మచింత, తాండవ ఉన్నత పాఠశాలలు, రోలుగుంట మండలం కుసర్లపూడి ఉన్నత పాఠశాలల్లో ఎస్‌ఎంసీ ఎన్నికలు జరగలేదు.

ఎస్‌.రాయవరం మండలం ఎస్‌.రాయవరం, దార్లపూడి జడ్పీ ఉన్నత పాఠశాలలు, దార్లపూడి ప్రాథమిక పాఠశాల, మునగపాక మండలంలో కేజీబీవీ, రావికమతం మండలం మరుపాక ఎంపీపీ ఆదర్శ పాఠశాల, చీడికాడ మండలం దిబ్బపాలెం ఉన్నత పాఠశాల, కొండెంపూడి ప్రాథమిక పాఠశాల, పాయకరావుపేట మండలం సీతారాంపురం ఎంపీపీ పాఠశాల,

Updated Date - Sep 30 , 2026 | 12:39 AM