Share News

జట్టీ నిర్మాణానికి స్థల పరిశీలన

ABN , Publish Date - Apr 05 , 2026 | 12:48 AM

నక్కపల్లి మండలం తీర ప్రాంతానికి ప్రభుత్వం జట్టీని మంజూరు చేసిన నేపథ్యంలో మత్స్యశాఖాధికారులు, టీడీపీ నాయకులు శనివారం స్థల పరిశీలన చేశారు.

	జట్టీ నిర్మాణానికి స్థల పరిశీలన
జట్టీ నిర్మాణానికి స్థల పరిశీలన చేస్తున్న మత్స్యశాఖాధికారులు, టీడీపీ నాయకులు

- బోయపాడులో పర్యటించిన అధికారులు, టీడీపీ నాయకులు

నక్కపల్లి, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): నక్కపల్లి మండలం తీర ప్రాంతానికి ప్రభుత్వం జట్టీని మంజూరు చేసిన నేపథ్యంలో మత్స్యశాఖాధికారులు, టీడీపీ నాయకులు శనివారం స్థల పరిశీలన చేశారు. హోం మంత్రి అనిత ఆదేశాల మేరకు మత్స్యశాఖ జిల్లా అధికారి విజయ్‌, ఎఫ్‌డీవో శృతి, టీడీపీ నియోజకవర కన్వీనర్‌ కొప్పిశెట్టి వెంకటేశ్‌, మత్స్యకార సొసైటీ అధ్యక్షుడు పిక్కి కోదండరావు ఆధ్వర్యంలో బోయపాడు గ్రామంలో పర్యటించారు. సుమారు 32 కోట్ల వ్యయంతో నిర్మించనున్న జట్టీకి సంబంధించి తీరం వెంబడి స్థల పరిశీలన చేశారు. త్వరలో జట్టీ నిర్మాణ పనులకు హోం మంత్రి ఆధ్వర్యంలో శంకుస్థాపన జరుగుతుందని కొప్పిశెట్టి వెంకటేశ్‌ చెప్పారు. ఈ కార్యక్రమంలో మత్స్యకార సంఘాల ప్రతినిధులు, టీడీపీ నాయకులు పిక్కి శ్రీను, పిక్కి సత్తియ్య, పిక్కి గంగరాజు, పూజారి పిక్కిదేముడు, పెదతీనార్ల ఎంపీటీసీ సభ్యుడు మేరుగు నాగేశ్వరరావు, సిరిపిల్లి అప్పలరాజు, జనసేన నాయకులు బొంది గుర్రన్న, పిక్కికొండలరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 05 , 2026 | 12:48 AM