వైభవంగా సీతారాముల కల్యాణం
ABN , Publish Date - Mar 28 , 2026 | 12:48 AM
జిల్లాలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కల్యాణ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. జిల్లాలో పాడేరు, అరకులోయ అసెంబ్లీ స్థానాల్లో ఉన్న అన్ని రామాలయాల్లోనూ నవమి వేడుకలను వైభవంగా నిర్వహించారు.
- జిల్లాలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు
పాడేరు, మార్చి 27(ఆంధ్రజ్యోతి): జిల్లాలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కల్యాణ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. జిల్లాలో పాడేరు, అరకులోయ అసెంబ్లీ స్థానాల్లో ఉన్న అన్ని రామాలయాల్లోనూ నవమి వేడుకలను వైభవంగా నిర్వహించారు. జిల్లా కేంద్రం పాడేరులోని సుండ్రుపుట్టు వీధిలో మొదలుకుని వాడవాడలా సీతారాముల కల్యాణాన్ని కనులవిందుగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే రామాలయాలకు భక్తులు బారులుతీరారు. అర్చకులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి సీతారాముల కల్యాణాన్ని వైభవంగా జరిపించారు. స్థానిక సుండ్రుపుట్టులో, మండలంలో సూకూరుపుట్టు, ఇరడాపల్లి, కిండంగి, సలుగు, హుకుంపేట మండలం గడుగుపల్లిలో అత్యంత వైభవంగా శ్రీరామనవమి వేడుకలు జరిపారు. చింతపల్లి మండల కేంద్రంతో పాటు చౌడుపల్లి, తాజంగి, జీకే వీధి, కొయ్యూరు, అరకులోయ, సీలేరు, తదితర ప్రాంతాల్లో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా జరిగాయి.