ఒకేసారి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు
ABN , Publish Date - Sep 17 , 2026 | 01:31 AM
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఒకేసారి జరుగుతాయని జడ్పీ సీఈవో పి. నారాయణమూర్తి అన్నారు. ఆయన బుధవారం తన ఛాంబర్‌లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.
పారదర్శకంగా పోలింగ్ కేంద్రాల ఏర్పాటు
జడ్పీ సీఈవో నారాయణమూర్తి
విశాఖపట్నం, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి):
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఒకేసారి జరుగుతాయని జడ్పీ సీఈవో పి. నారాయణమూర్తి అన్నారు. ఆయన బుధవారం తన ఛాంబర్‌లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఒకేసారి నిర్వహిస్తారా? లేదా వేర్వేరుగానా?...అని సందేహం వ్యక్తంచేశారు. అందుకు సీఈవో స్పందిస్తూ రెండు ఎన్నికలు ఒకేసారి నిర్వహిస్తారని స్పష్టంచేశారు. మొత్తం 652 ఎంపీటీసీ స్థానాల పరిధిలో 2,342 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేశామని పేర్కొంటూ వాటి వివరాలతో కూడిన ముసాయిదా విడుదల చేశామన్నారు. పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై అభ్యంతరాలు, సందేహాలుంటే చెప్పాలని, సూచనలు చేయాలని కోరారు. గత ఎన్నికల్లో ఉన్న కేంద్రాలకు ప్రస్తుతం గుర్తించిన వాటికి పెద్దగా తేడా లేదని పలువురు చెప్పారు. సమావేశంలో డిప్యూటీ సీఈవో రాజకుమార్, పార్టీల ప్రతినిధులు సోడదాసు సుధాకర్, కృష్ణకాంత్ ఇంకా పలువురు పాల్గొన్నారు.