అడుగడుగునా గోతులు
ABN , Publish Date - Mar 06 , 2026 | 12:44 AM
అచ్యుతాపురం నుంచి ఎలమంచిలి వెళ్లే ప్రధాన రహదారిలో రాంబిల్లి మండల పరిధిలోని వెంకటాపురం జంక్షన్ నుంచి కొత్తూరు వరకు సుమారు మూడు కిలోమీటర్ల మేర పలుచోట్ల భారీ గోతులు ఏర్పడ్డాయి. అచ్యుతాపురం సెజ్, పరవాడ మండలంలోని ఫార్మాసిటీ, ఇతర పరిశ్రమలు, రాంబిల్లి మండలంలోని ఎన్‌ఏవోబీకి వివిధ రకాల వస్తుసామగ్రితో తుని వైపు నుంచి వచ్చే భారీ వాహనాలు ఎలమంచిలి నుంచి ఈ మార్గంలోనే వస్తుంటాయి. దీంతో నిత్యం వేలాది వాహనాల రాకపోకలతో ఈ రోడ్డు రద్దీగా వుంటున్నంది.
వెంకటాపురం జంక్షన్- కొత్తూరు మధ్య ఛిద్రమైన రహదారి
ఇబ్బంది పడుతున్న వాహనదారులు
నిర్వహణ పనులు చేపట్టని ఆర్‌అండ్‌బీ అధికారులు
రాంబిల్లి, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): అచ్యుతాపురం నుంచి ఎలమంచిలి వెళ్లే ప్రధాన రహదారిలో రాంబిల్లి మండల పరిధిలోని వెంకటాపురం జంక్షన్ నుంచి కొత్తూరు వరకు సుమారు మూడు కిలోమీటర్ల మేర పలుచోట్ల భారీ గోతులు ఏర్పడ్డాయి. అచ్యుతాపురం సెజ్, పరవాడ మండలంలోని ఫార్మాసిటీ, ఇతర పరిశ్రమలు, రాంబిల్లి మండలంలోని ఎన్‌ఏవోబీకి వివిధ రకాల వస్తుసామగ్రితో తుని వైపు నుంచి వచ్చే భారీ వాహనాలు ఎలమంచిలి నుంచి ఈ మార్గంలోనే వస్తుంటాయి. దీంతో నిత్యం వేలాది వాహనాల రాకపోకలతో ఈ రోడ్డు రద్దీగా వుంటున్నంది. అయితే ఆర్‌అండ్‌బీ పరిధిలోని ఈ రహదారి నిర్వహణ పనులను అధికారులు ఏడాది నుంచి చేపట్టకపోవడంతో గోతులు నానాటికీ పెద్దవి అవుతున్నాయని వాహనదారులు ఆరోపిస్తున్నారు. పలుచోట్ల రోడ్డు మొత్తం ఛిద్రమైంది. కొన్నిచోట్ల రహదారి మధ్యలో గోతులు వున్నాయి. వీటిని తప్పించే క్రమంలో వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. రాత్రిపూట దగ్గరకు వచ్చే వరకు గోతులు కనిపించకపోవడంతో ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలబారిన పడుతున్నారు.