Share News

34 మంది బీఎల్‌వోలకు షోకాజ్‌ నోటీసులు

ABN , Publish Date - Jul 02 , 2026 | 12:59 AM

జిల్లాలో ఎన్నికలకు సంబంధించిన విధులు సక్రమంగా నిర్వహించని 34 మంది బూత్‌ స్థాయి అధికారులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశామని జాయింట్‌ కలెక్టర్‌ తిరుమాని శ్రీపూజ బుధవారం తెలిపారు.

34 మంది బీఎల్‌వోలకు షోకాజ్‌ నోటీసులు
జేసీ టి.శ్రీపూజ

జేసీ టి.శ్రీపూజ వెల్లడి

పాడేరు, జూలై 1(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఎన్నికలకు సంబంధించిన విధులు సక్రమంగా నిర్వహించని 34 మంది బూత్‌ స్థాయి అధికారులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశామని జాయింట్‌ కలెక్టర్‌ తిరుమాని శ్రీపూజ బుధవారం తెలిపారు. ఎన్నికల కమిషన్‌ అప్పగించిన విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉండే వారిపై శాఖాపరమైన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. ముఖ్యంగా ఓటరు జాబితాల సవరణ, తదితర అంశాల్లో అలసత్వం ప్రదర్శించినందుకు జి.మాడుగులలో 8 మందికి, కొయ్యూరులో 8, జీకేవీధిలో 7, పాడేరులో 6, చింతపల్లిలో ఐదుగురు బూత్‌ స్థాయి అధికారులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశామన్నారు. ఎన్నికల కమిషన్‌ సూచనల మేరకు గడువు నాటికి అప్పగించిన పనులను పక్కాగా చేపట్టాలని, లేకుంటే సంబంధిత అధికారులపై ఎన్నికల కమిషన్‌ను నివేదిస్తామని జేసీ పేర్కొన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని ఆమె హెచ్చరించారు.

Updated Date - Jul 02 , 2026 | 12:59 AM