Share News

సచివాలయ ఉద్యోగులకు షోకాజు నోటీసులు

ABN , Publish Date - Jun 11 , 2026 | 11:00 PM

మండల కేంద్రంలోని గ్రామ సచివాలయ ఉద్యోగులకు గూడెంకొత్తవీధి పంచాయతీ కార్యదర్శి పండ్రా పాల్‌ షోకాజు నోటీసులు జారీచేశారు.

సచివాలయ ఉద్యోగులకు షోకాజు నోటీసులు

‘ఆంధ్రజ్యోతి’ ఎపెక్ట్‌

గూడెంకొత్తవీధి, జూన్‌ 11 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని గ్రామ సచివాలయ ఉద్యోగులకు గూడెంకొత్తవీధి పంచాయతీ కార్యదర్శి పండ్రా పాల్‌ షోకాజు నోటీసులు జారీచేశారు. గ్రామ సచివాలయం ఉద్యోగులు విధులకు గైర్హాజరుపై గురువారం ‘ఆంధ్రజ్యోతి’లో ‘విధులకు సచివాలయ ఉద్యోగులు డుమ్మా’ శీర్షికన కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి జిల్లా కలెక్టర్‌ నిషాంతి స్పందించి విధులకు దూరమైన సచివాలయ ఉద్యోగులపై విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని ఎంపీడీవోని ఆదేశించారు. ఈమేరకు ఎంపీడీవో రమణబాబు ఆదేశాల మేరకు సచివాలయ ఉద్యోగులు డిజిటల్‌ అసిస్టెంట్‌, వెల్ఫేర్‌ అసిస్టెంట్‌, మహిళా కానిస్టేబుల్‌, వీఆర్వో, అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌లకు షోకాజు నోటీసులను పంచాయతీ కార్యదర్శి జారీ చేశారు. విధులకు ఎందుకు గైర్హాజరయ్యారు? శాఖపరమైన చర్యలు ఎందుకు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.

Updated Date - Jun 11 , 2026 | 11:00 PM