Share News

69 మంది టీచర్లకు షోకాజ్‌ నోటీసులు

ABN , Publish Date - Jun 20 , 2026 | 11:22 PM

ప్రభుత్వ పాఠశాలల్లో ముఖ హాజరు నమోదు చేయని 69 మంది ఉపాధ్యాయులకు ఎంఈవో సింహాచలం షోకాజ్‌ నోటీసులు జారీచేశారు.

69 మంది టీచర్లకు షోకాజ్‌ నోటీసులు

ముఖ హాజరు వేయని వైనం

కొయ్యూరు, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి):ప్రభుత్వ పాఠశాలల్లో ముఖ హాజరు నమోదు చేయని 69 మంది ఉపాధ్యాయులకు ఎంఈవో సింహాచలం షోకాజ్‌ నోటీసులు జారీచేశారు. ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి ప్రతీ ఉపాధ్యాయుడు విధిగా ముఖ గుర్తింపు హాజరు నమోదు చేయాల్సి ఉన్నా పాఠశాలలు పునఃప్రారంభమై వారం రోజులు దాటిన ఉపాధ్యాయులు ఈ నిబంధన పాటించలేదని పేర్కొన్నారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి షోకాజ్‌ నోటీసులు జారీ చేశామన్నారు. నోటీసులు అందుకున్న ఉపాధ్యాయులు మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని, గడువులోగా స్పందించని ఉపాధ్యాయులపై క్రమశిక్షణ చర్యలకు కలెక్టరుకు నివేదిస్తామన్నారు. ముఖ హాజరు నమోదు చేసుకోని వారు విధులకు హాజరుకానట్టుగా పరిగణించబడతారని ఎంఈవో సింహాచలం స్పష్టం చేశారు.

Updated Date - Jun 20 , 2026 | 11:22 PM