Share News

27 మంది అధ్యాపకులకు షోకాజ్‌

ABN , Publish Date - May 07 , 2026 | 01:03 AM

ఇంటర్‌ పరీక్షా ఫలితాల్లో ఈ ఏడాది అతి తక్కువ ఉత్తీర్ణత వచ్చిన ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల అధ్యాపకులపై చర్యలకు ఇంటర్మీడియట్‌ బోర్డు అధికారులు రంగం సిద్ధం చేశారు. ఏ సబ్జెక్టుల్లో ఎక్కువ మంది విద్యార్థులు ఫెయిల్‌ అయ్యారో...ఆయా సబ్జెక్టులు బోధించిన లెక్చరర్లకు షోకాజ్‌ నోటీసులు జారీ చేయనున్నట్టు తెలిసింది. ఇంటర్‌ సాధారణ కోర్సులతోపాటు ఒకేషనల్‌ కోర్సులకు సంబంధించి కూడా క్రమశిక్షణ చర్యలు ఉంటాయని చెబుతున్నారు.

27 మంది  అధ్యాపకులకు షోకాజ్‌

ఇంటర్‌లో ఉత్తీర్ణత తగ్గడంపై ప్రభుత్వం సీరియస్‌

విశాఖపట్నం, మే 6 (ఆంధ్రజ్యోతి):

ఇంటర్‌ పరీక్షా ఫలితాల్లో ఈ ఏడాది అతి తక్కువ ఉత్తీర్ణత వచ్చిన ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల అధ్యాపకులపై చర్యలకు ఇంటర్మీడియట్‌ బోర్డు అధికారులు రంగం సిద్ధం చేశారు. ఏ సబ్జెక్టుల్లో ఎక్కువ మంది విద్యార్థులు ఫెయిల్‌ అయ్యారో...ఆయా సబ్జెక్టులు బోధించిన లెక్చరర్లకు షోకాజ్‌ నోటీసులు జారీ చేయనున్నట్టు తెలిసింది. ఇంటర్‌ సాధారణ కోర్సులతోపాటు ఒకేషనల్‌ కోర్సులకు సంబంధించి కూడా క్రమశిక్షణ చర్యలు ఉంటాయని చెబుతున్నారు.

గత నెలలో ఫలితాలు వెలువడిన తరువాత జిల్లాలో తక్కువ ఫలితాలు వచ్చిన ప్రిన్సిపాళ్ల నుంచి వివరణ తీసుకున్నారు. అయితే సబ్జెక్టుల వారీగా ఉత్తీర్ణతను పరిశీలించిన మీదట 27 మంది అధ్యాపకులకు షోకాజ్‌ ఇవ్వాలని నిర్ణయించారు. కృష్ణా కళాశాల, ఆనందపురం, మల్కాపురం, పెందుర్తి, భీమిలి జూనియర్‌ కళాశాలలల్లో నాలుగురేసి అధ్యాపకులకు, మధురవాడ, ఇస్లాంపేట కళాశాలల్లో ముగ్గురేసి చొప్పున, అగనంపూడి కళాశాలలో ఒకరికి షోకాజ్‌ ఇస్తామని జిల్లా వృత్తివిద్యాశాఖాధికారి ఉమారాణి తెలిపారు. ఇదిలావుండగా పరీక్ష తప్పిన విద్యార్థులు సప్లమెంటరీ పరీక్షలకు హాజరై ఉత్తీర్ణత సాధించేలా కళాశాలల్లో పునశ్చరణ తరగతులు నిర్వహిస్తున్నామని ఆమె తెలిపారు.

Updated Date - May 07 , 2026 | 01:03 AM