Share News

ఆస్పత్రుల్లో మందుల కొరత

ABN , Publish Date - Nov 26 , 2026 | 01:25 AM

నగర పరిధిలోని బోధనాస్పత్రులతోపాటు అర్బన్‌ హెల్త్‌ సెంటర్లలో కొన్నిరకాల మందులు అందుబాటులో లేవు. దీంతో రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్‌లోనే మందులు లేకపోవడంతో ఆస్పత్రులకు సరఫరా సవ్యంగా సాగడం లేదని తెలుస్తోంది. దీంతో కీలకమైన కేజీహెచ్‌, వీజీహెచ్‌, మానసిక వైద్యశాల, ఛాతీ, అంటువ్యాధుల ఆస్పత్రి, ఈఎన్‌టీ ఆస్పత్రితోపాటు అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు, గ్రామీణ ప్రాంతంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మందుల కొరత నెలకొన్నట్టు చెబుతున్నారు.

ఆస్పత్రుల్లో  మందుల కొరత

బోధనాస్పత్రులు, అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులో లేని అన్ని రకాల మందులు

బయట కొనుక్కోవాల్సి వస్తుందంటున్న రోగులు

సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్‌ నుంచి పూర్తిస్థాయిలో సరఫరా కాకపోవడంతో ఇబ్బందులు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

నగర పరిధిలోని బోధనాస్పత్రులతోపాటు అర్బన్‌ హెల్త్‌ సెంటర్లలో కొన్నిరకాల మందులు అందుబాటులో లేవు. దీంతో రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్‌లోనే మందులు లేకపోవడంతో ఆస్పత్రులకు సరఫరా సవ్యంగా సాగడం లేదని తెలుస్తోంది. దీంతో కీలకమైన కేజీహెచ్‌, వీజీహెచ్‌, మానసిక వైద్యశాల, ఛాతీ, అంటువ్యాధుల ఆస్పత్రి, ఈఎన్‌టీ ఆస్పత్రితోపాటు అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు, గ్రామీణ ప్రాంతంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మందుల కొరత నెలకొన్నట్టు చెబుతున్నారు.

ప్రధానంగా షుగర్‌, బీపీ, గుండె జబ్బులు, ఇతర సమస్యలతో బాధపడే రోగులు ప్రతిరోజూ వినియోగించే మందుల్లో అనేకం ఆస్పత్రుల్లో లేవు. కేజీహెచ్‌తోపాటు ఇతర ఆస్పత్రుల్లో పారా సిట్మాల్‌, ఇన్ఫెక్షన్ల చికిత్సలో వినియోగించే అమోక్షిలిన్‌, అజిత్రోమైసిన్‌, సెఫిక్సైన్‌, మెట్రోనిడజోల్‌, అలర్జీకి వినియోగించే లివోసిట్రిజన్‌, నొప్పులు, వాపులు నివారణకు వినియోగించే డైక్లోఫినాక్‌, గ్యాస్ర్టిక్‌ సమస్య నివారణకు వినియోగించే పాంటాప్రోజోల్‌, మానసిక రోగులకు వినియోగించే ఫ్లూక్సోటైన్‌, సెట్రోలైన్‌, సోడియం వాల్పోరేట్‌, ఆస్తమా నియంత్రణకు వినియోగించే బుడోసోనైడ్‌, శ్వాసనాళాల సంకోచానికి వినియోగించే కొన్నిరకాల మందులు అందుబాటులో లేవని చెబుతున్నారు. వీటితోపాటు రక్తహీనత, కాల్షియం లోప నివారణ, గర్భధారణలో అధిక రక్తపోటు నియంత్రణకు వైద్యులు సూచించే మందులు కూడా ఇవ్వడం లేదని, బయట కొనుగోలు చేయాల్సి వస్తోందని రోగులు చెబుతున్నారు.

ఇండెంట్లు పెట్టడమే..

మందుల కోసం ఫార్మసీ విభాగం అధికారులు ఇండెంట్లు పెడుతుంటారు. ఇండెంట్లు పెట్టడం తప్ప మందులు సరఫరా చేయడం లేదని పలువురు అధికారులు చెబుతున్నారు. తాము పెట్టిన ఇండెంట్‌ సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్‌కు వెళ్లడానికి రోజులు పడుతోందని, అక్కడకు వెళ్లిన తరువాత కూడా పూర్తిస్థాయిలో మందులు సరఫరా చేయడం లేదని ఒక ఆస్పత్రి ఫార్మసీ విభాగానికి చెందిన అధికారి పేర్కొన్నారు. ఉన్న మందులనే రోగుల సంఖ్యకు అనుగుణంగా సర్దుబాటు చేయాల్సి వస్తోందని వెల్లడించారు.

Updated Date - Nov 26 , 2026 | 01:25 AM