ప్రభుత్వ భూమిలో దుకాణాలు
ABN , Publish Date - Sep 07 , 2026 | 01:05 AM
ఆనందపురం మండలం గండిగుండం రెవెన్యూ పరిధిలో సుమారు 60 సెంట్ల ప్రభుత్వ భూమిని కొందరు ఆక్రమించుకుని దుకాణాలు నిర్మించారు. భోగాపురం ఎయిర్‌పోర్టు కనెక్టివిటీ కోసం విస్తరిస్తున్న రహదారి పక్కనే ఈ స్థలం ఉంది.
గండిగుండంలో ఆక్రమణ
పట్టించుకోని రెవెన్యూ అధికారులు
విశాఖపట్నం, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి):
ఆనందపురం మండలం గండిగుండం రెవెన్యూ పరిధిలో సుమారు 60 సెంట్ల ప్రభుత్వ భూమిని కొందరు ఆక్రమించుకుని దుకాణాలు నిర్మించారు. భోగాపురం ఎయిర్‌పోర్టు కనెక్టివిటీ కోసం విస్తరిస్తున్న రహదారి పక్కనే ఈ స్థలం ఉంది. స్థానికంగా కొందరు నాయకుల దన్నుతోనే ప్రభుత్వ భూమిలో పాగా వేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జీవనోపాధి కోసం రోడ్డుపక్కన చిన్న బడ్డీలు పెట్టుకుంటేనే అధికారులు ఆగమేఘాలపై వచ్చి తొలగిస్తుంటారు. అటువంటిది షట్టర్లతో పక్కా నిర్మాణాలు చేపట్టినా స్థానిక వీఆర్వో, పంచాయతీ కార్యదర్శి సహా రెవెన్యూ అధికారులెవరూ కనీసం స్పందించలేదు. సొమ్ములు తీసుకుని మౌనంగా ఉండిపోయారనే వాదన వినిపిస్తోంది. దుకాణాలు నిర్మించి దానికి పసుపురంగు వేయడంతో అధికారులు మౌనం పాటిస్తున్నారని చెబుతున్నారు.