వణికిస్తున్న చలి
ABN , Publish Date - Feb 10 , 2026 | 11:22 PM
మన్యంలో పొగమంచు తీవ్రత తగ్గలేదు. కనిష్ఠ ఉష్ణోగ్రతలు కాస్త పెరిగినప్పటికీ చలి తగ్గుముఖం పట్టలేదు.
మన్యంలో దట్టంగా పొగమంచు
ముంచంగిపుట్టులో 8.1 డిగ్రీలు
పాడేరు, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): మన్యంలో పొగమంచు తీవ్రత తగ్గలేదు. కనిష్ఠ ఉష్ణోగ్రతలు కాస్త పెరిగినప్పటికీ చలి తగ్గుముఖం పట్టలేదు. దీంతో ఏజెన్సీ వాసులు చలికి వణుకుతున్నారు. మంగళవారం పాడేరుతో సహా దాదాపుగా అన్ని మండలాల్లోనూ ఉదయం పది గంటల వరకు దట్టంగా పొగమంచు కురిసింది. ముంచంగిపుట్టులో 8.1, అరకులోయలో 8.8, పెదబయలులో 10.6, హుకుంపేటలో 11.8, చింతపల్లిలో 12.0, అనంతగిరిలో 14.7, కొయ్యూరులో 15.1 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ముంచంగిపుట్టులో..
ముంచంగిపుట్టు: మండలంలో మంగళవారం చలి తీవ్రత ఎక్కువగా ఉంది. ఉదయం 8 గంటల వరకు మంచు తెరలు వీడలేదు. వాహనదారులు లైట్ల వెలుతురులోనే రాకపోకలు సాగించాల్సి వచ్చింది.