వణికిస్తున్న చలి
ABN , Publish Date - Jan 01 , 2026 | 12:11 AM
మన్యంలో చలి గజగజ వణికిస్తోంది. వాతావరణంలో మార్పులతో పాటు ఉత్తరాది నుంచి వీస్తున్న శీతల గాలుల ప్రభావంతో చలి చంపేస్తున్నది. ఉదయం వేళల్లో పొగమంచు దట్టంగానే కురుస్తున్నది.
ముంచంగిపుట్టులో 8.4 డిగ్రీలు
పాడేరు, డిసెంబరు 31(ఆంధ్రజ్యోతి): మన్యంలో చలి గజగజ వణికిస్తోంది. వాతావరణంలో మార్పులతో పాటు ఉత్తరాది నుంచి వీస్తున్న శీతల గాలుల ప్రభావంతో చలి చంపేస్తున్నది. ఉదయం వేళల్లో పొగమంచు దట్టంగానే కురుస్తున్నది. బుధవారం జిల్లా కేంద్రం పాడేరులో తెల్లవారుజాము నుంచి ఉదయం పదిన్నర గంటల వరకు పొగమంచు దట్టంగా కురిసింది. దీంతో ఎదురుగా ఉన్న వ్యక్తులు సైతం కనిపించని పరిస్థితి నెలకొంది. వాహనాలు లైట్లు వేసుకుని రాకపోకలు సాగించాల్సి వచ్చింది.
కొనసాగుతున్న కనిష్ఠ ఉష్ణోగ్రతలు
మన్యంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. బుధవారం ముంచంగిపుట్టులో 8.4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదుకాగా, జి.మాడుగులలో 8.6, పెదబయలులో 10.0, అరకులోయలో 10.8, డుంబ్రిగుడలో 12.1, చింతపల్లిలో 12.2, హుకుంపేటలో 12.8, పాడేరులో 12.9, కొయ్యూరులో 15.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.