వణికిస్తున్న చలి
ABN , Publish Date - Nov 17 , 2026 | 12:32 AM
మన్యంలో ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పడుతుండడంతో చలి తీవ్రత కొనసాగుతున్నది.
ముంచంగిపుట్టు, అరకులో 11 డిగ్రీలు
పాడేరు, నవంబరు 16(ఆంధ్రజ్యోతి): మన్యంలో ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పడుతుండడంతో చలి తీవ్రత కొనసాగుతున్నది. దీంతో ఏజెన్సీ వాసులు చలికి వణుకుతున్నారు. సోమవారం ఉదయం పది గంటల వరకు పొగమంచు కమ్మేసింది. ఆ తరువాత నుంచి ఎండ పెద్దగా ప్రభావం చూపలేదు. పొగమంచు దట్టంగా కమ్మేయడంతో వాహనాలు లైట్లు వేసుకుని రాకపోకలు సాగించాయి. కొయ్యూరులో సోమవారం 16.9, అనంతగిరిలో 16.6, పాడేరులో 14.4, జీకేవీధిలో 14.0, చింతపల్లిలో 13.2, హుకుంపేటలో 12.8, జి.మాడుగులలో 12.6, పెదబయలులో 11.6, డుంబ్రిగుడలో 11.2, అరకులోయ, ముంచంగిపుట్టులో 11.0 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.