పీజీఆర్‌ఎస్‌పై ప్రజా స్పందన తెలపండి
ABN , Publish Date - Aug 30 , 2026 | 11:14 PM
ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ(పీజీఆర్‌ఎస్)ను మరింత పారదర్శకంగా అమలు చేసేందుకు ప్రజా స్పందన తెలపాలని కలెక్టర్ టి.నిషాంతి ఆదివారం ఒక ప్రకటనలో సూచించారు.
కలెక్టర్ టి.నిషాంతి సూచన
పాడేరు, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ(పీజీఆర్‌ఎస్)ను మరింత పారదర్శకంగా అమలు చేసేందుకు ప్రజా స్పందన తెలపాలని కలెక్టర్ టి.నిషాంతి ఆదివారం ఒక ప్రకటనలో సూచించారు. అర్జీదారుల సౌకర్యార్థం ప్రత్యేకంగా క్యూర్‌ఆర్ కోడ్‌ను రూపొందించి, ప్రజాభిప్రాయాన్ని సేకరించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. ప్రధానంగా తమ సమస్యలపై ప్రజలు పీజీఆర్‌ఎస్‌లో అధికారులకు సమర్పించే అర్జీల పరిష్కారం, వాటి స్థితిగతులను తెలుసుకునేందుకు, ప్రజాస్పందన వెల్లడించేందుకు క్యూఆర్ కోడ్ ఉపయోగపడుతుందన్నారు. అర్జీదారులు ఈ సదుపాయాన్ని వినియోగించుకుని తమ స్పందనను విధిగా తెలియజేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. కాగా క్యూఆర్ కోడ్‌ను పీజీఆర్‌ఎస్ నిర్వహించే జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయిలో ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు.