Share News

రాష్ట్రస్థాయి సైక్లింగ్‌ పోటీలకు ఎంపిక

ABN , Publish Date - Feb 25 , 2026 | 01:21 AM

జిల్లా కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్‌ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల క్రీడా మైదానంలో జిల్లాస్థాయి సైక్లింగ్‌ పోటీలు నిర్వహించినట్టు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి ఎ.జగన్మోహనరావు తెలిపారు.

రాష్ట్రస్థాయి సైక్లింగ్‌ పోటీలకు ఎంపిక
సైక్లింగ్‌ పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు

పాడేరురూరల్‌, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): జిల్లా కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్‌ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల క్రీడా మైదానంలో జిల్లాస్థాయి సైక్లింగ్‌ పోటీలు నిర్వహించినట్టు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి ఎ.జగన్మోహనరావు తెలిపారు. తొలుత ఈ పోటీలను ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎస్‌.విశ్వప్రసాద్‌, ఎస్‌జీఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి పి.సూరిబాబు ప్రారంభించారు. అండర్‌-18 విభాగంలో బాలురు, బాలికలకు ఎంపిక పోటీలు నిర్వహించారు. ఉత్తమ ప్రతిభ చూపిన బాలుర విభాగం నుంచి గుమ్మకోట పాఠశాలకు చెందిన పి.అజయ్‌, పాడేరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన పి.కిరణ్‌బాబు, ఎం.నిఖిల్‌, ఎస్‌.దుర్గాప్రసాద్‌, కె.చైతన్యకుమార్‌, ఎం.చక్రధర్‌, కె.సందీప్‌ జాన్‌, ఓ.మోహిత్‌ కుమార్‌, బాలికల విభాగం నుంచి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన ఎన్‌.లిఖిత, ఎస్‌.కావ్యశ్రీ, కె.కీర్తన, పి.అమృత వర్షిణి, ఎం.నవ్యశ్రీ, కె.రూపశ్రీ, ఎస్‌.మంజులరాణి, పి.స్వాతిలను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేశామన్నారు. ఈ నెల 28, మార్చి ఒకటి తేదీల్లో విజయవాడలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో వీరు పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు జె.నాగేంద్రబాబు, ఎస్‌.దిలీప్‌ కుమార్‌, టి.లింగన్న, ఎం.భూపతిరాజు పాల్గొన్నారు.

Updated Date - Feb 25 , 2026 | 01:21 AM