Share News

రెండు నెలలు చూడండి

ABN , Publish Date - May 25 , 2026 | 12:22 AM

‘‘మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించండి. రెండు నెలలపాటు మా ఉపాధ్యాయుల బోధనను పరిశీలించండి. చదువు బాగోలేదని అనిపిస్తే.. మీ పిల్లలను ప్రైవేటు స్కూళ్లలో చేర్పించుకోండి’’ అని జిల్లా విద్యా శాఖాధికారి గిడ్డి అప్పారావునాయుడు తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత ్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికపై ఆదివారం పట్టణంలోని పలు వార్డుల్లో ఇంటింటా ప్రచారం నిర్వహించారు.

రెండు నెలలు చూడండి
ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్‌ పత్రాన్ని విద్యార్థిని తల్లిదండ్రులకు ఇస్తున్న డీఈవో అప్పారావునాయుడు

ప్రభుత్వ పాఠశాలల్లో బోధన బాగోకపోతే ‘ప్రైవేటు’కు వెళ్లండి

విద్యార్థుల తల్లిదండ్రులకు డీఈవో వినతి

చోడవరం, మే 24 (ఆంధ్రజ్యోతి): ‘‘మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించండి. రెండు నెలలపాటు మా ఉపాధ్యాయుల బోధనను పరిశీలించండి. చదువు బాగోలేదని అనిపిస్తే.. మీ పిల్లలను ప్రైవేటు స్కూళ్లలో చేర్పించుకోండి’’ అని జిల్లా విద్యా శాఖాధికారి గిడ్డి అప్పారావునాయుడు తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత ్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికపై ఆదివారం పట్టణంలోని పలు వార్డుల్లో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో నిపుణులైన ఉపాధ్యాయులతో చక్కటి బోధన జరుగుతుందన్న విషయం చాలామంది తల్లిదండ్రులకు తెలియక తమ పిల్లలను ప్రైవేటు స్కూళ్లల్లో చేర్పిస్తున్నారని అన్నారు అయితే ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలపై తాము నిర్వహిస్తున్న ప్రచారం వల్ల తల్లిదండ్రుల్లో మార్పు వస్తున్నదన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నిపుణులైన ఉపాధ్యాయులు చక్కని బోధన అందిస్తున్న విషయంతోపాటు చిన్నారుల కోసం ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలు, సౌకర్యాలు, పథకాల గురించి వివరిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో బోధనను రెండు నెలలు గమనించాలని, బోధన బాగో లేదనిపిస్తే పిల్లలను మీకు నచ్చిన పాఠశాలలో చేర్పించుకోవచ్చని వివరిస్తున్నామని అన్నారు. గత విద్యా సంవత్సరంలో ప్రైవేటు పాఠశాలల్లో చదివించిన తల్లిదండ్రులు, ఈ ఏడాది తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తామని చెబుతున్నారని అన్నారు. అయితే కొంతమంది తల్లిదండ్రులు.. గత ఏడాదికి సంబంధించి ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల బకాయిలు వున్నాయని చెప్పగా, ఆయా ప్రైవేటు స్కూళ్ల యజమానులతో తాము మాట్లాడతామని, పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని సూచించామన్నారు. డీఈవో వెంట ఎంఈవోలు సింహాచలంనాయుడు, నీలకంఠం, బాలికల హైస్కూల్‌ హెచ్‌ ఎం ఐ.వి.రామిరెడ్డి, సీఆర్‌ పీ కేవీఎం నాయుడు, స్కూల్‌ కమిటీ చైర్మన్‌ గుమ్మాల సత్తిబాబు, స్థానిక ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు వున్నారు.

Updated Date - May 25 , 2026 | 12:22 AM