Share News

రోడ్డు ప్రమాదంలో సచివాలయ కార్యదర్శి మృతి

ABN , Publish Date - Jul 16 , 2026 | 01:12 AM

జాతీయ రహదారిపై మర్రిపాలెం వద్ద బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో వడ్లపూడి సచివాలయంలో ఎమినిటీస్‌ సెక్రటరీగా పనిచేస్తున్న బేతా నరేంద్ర అరుణ్‌కుమార్‌ మృతిచెందారు. ఎయిర్‌పోర్ట్‌ జోన్‌ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గాజువాక వంద అడుగుల రోడ్డులోని కుంచుమాంబ కాలనీకి చెందిన అరుణ్‌కుమార్‌ ద్విచక్ర వాహనంపై నగరంలోకి బయలుదేరారు.

రోడ్డు ప్రమాదంలో  సచివాలయ కార్యదర్శి మృతి
బేతా నరేంద్ర అరుణ్‌కుమార్‌ (ఫైల్‌ ఫోటో)

ఎనిమిది నెలల కిందట వివాహం

మాధవధార, జూలై 15 (ఆంధ్రజ్యోతి):

జాతీయ రహదారిపై మర్రిపాలెం వద్ద బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో వడ్లపూడి సచివాలయంలో ఎమినిటీస్‌ సెక్రటరీగా పనిచేస్తున్న బేతా నరేంద్ర అరుణ్‌కుమార్‌ మృతిచెందారు. ఎయిర్‌పోర్ట్‌ జోన్‌ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గాజువాక వంద అడుగుల రోడ్డులోని కుంచుమాంబ కాలనీకి చెందిన అరుణ్‌కుమార్‌ ద్విచక్ర వాహనంపై నగరంలోకి బయలుదేరారు. జీఎస్‌ఐ కార్యాలయం ఎదురుగా తన ద్విచక్ర వాహనానికి సమీపంగా వచ్చిన కారును తప్పించుకోబోయి రోడ్డుపై పడిపోయారు. అదే సమయంలో వెనుకు వస్తున్న భారీ ట్రాలర్‌ అతనిపై నుంచి వెళ్లిపోవడంతో ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. అరుణ్‌కుమార్‌కు గత ఏడాది 2025 నవంబరు 27వ తేదీన వివాహమైంది. విధుల్లో భాగంగా ఓటరు జాబితాల సమగ్ర సవరణ (సర్‌) కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళుతూ ప్రమాదానికి గురైనట్టు సహోద్యోగులు చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కేజీహెచ్‌కు తరలించిన ఎయిర్‌పోర్టు లా అండ్‌ ఆర్డర్‌ పోలీసులు ప్రమాదంపై విచారణ చేపడుతున్నారు. అరుణ్‌ తండ్రి అప్పారావు టైలరింగ్‌ చేస్తారు. తల్లి కామేశ్వరి ఇదివరకే చనిపోయారు. చెల్లెలు ఎన్‌ఏడీ కొత్తరోడ్డు జంక్షన్‌లో నివాసం ఉంటున్నారు.

Updated Date - Jul 16 , 2026 | 01:12 AM