Share News

పన్ను వసూళ్లలో రెండో స్థానం

ABN , Publish Date - Feb 26 , 2026 | 01:17 AM

పంచాయతీల పరిధిలో ఆస్తి, ఇతర పన్నుల వసూళ్లలో జిల్లా...రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.11.3 కోట్లకుగాను శనివారం నాటికి రూ.8.07 (71.4 శాతం) కోట్లు వసూలైంది. జిల్లాలోని నాలుగు మండలాల పరిధిలో గల 79 పంచాయతీల్లో 51 వేల అసెస్‌మెంట్లు ఉన్నాయి. నగరానికి ఆనుకుని ఉన్న పంచాయతీల నుంచి ఎక్కువ ఆదాయం వస్తోంది.

పన్ను వసూళ్లలో రెండో స్థానం

పంచాయతీల లక్ష్యం రూ.11.3

కోట్లు

ఇప్పటివరకూ వసూలైంది రూ.8.07 కోట్లు

వచ్చే నెలాఖరుకు నూరుశాతం వసూలు చేస్తామంటున్న జిల్లా పంచాయతీ అధికారి

విశాఖపట్నం, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి):

పంచాయతీల పరిధిలో ఆస్తి, ఇతర పన్నుల వసూళ్లలో జిల్లా...రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.11.3 కోట్లకుగాను శనివారం నాటికి రూ.8.07 (71.4 శాతం) కోట్లు వసూలైంది. జిల్లాలోని నాలుగు మండలాల పరిధిలో గల 79 పంచాయతీల్లో 51 వేల అసెస్‌మెంట్లు ఉన్నాయి. నగరానికి ఆనుకుని ఉన్న పంచాయతీల నుంచి ఎక్కువ ఆదాయం వస్తోంది. అత్యధికంగా వేములవలస పంచాయతీ నుంచి రూ.1.5 కోట్లు సమకూరుతోంది. వేములవలసలో మార్కెట్‌, సంత వేలం నుంచి ఏటా రూ.1.35 కోట్లు ఆదాయం లభిస్తోంది. గంభీరం పంచాయతీ నుంచి రూ.82 లక్షలు, వెల్లంకి నుంచి రూ.72 లక్షల ఆదాయం లభిస్తోంది. గత ఏడాది బకాయిలు రూ.1.92 కోట్లు ఉండగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.9.38 కోట్లు మొత్తం రూ.11.3 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. ఇందులో గత ఏడాది బకాయిల నుంచి రూ.0.96 కోట్లు, కరెంట్‌ డిమాండ్‌ నుంచి రూ.7.1 కోట్లు...మొత్తం రూ.8.07 కోట్లు వసూలు చేశారు. ఇంకా పాత బకాయిలు రూ.0.96 కోట్లు, కరెంట్‌ డిమాండ్‌ నుంచి రూ.2.27 కోట్లు మొత్తం రూ.3.25 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. కాగా నగరానికి ఆనుకుని ఉన్న వాణిజ్య భవనాల నుంచి పన్నుల వసూళ్లపై ‘ఆంధజ్యోతి’ పలు కథనాలు ప్రచురించడంతో పంచాయతీ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి రాజకీయ ఒత్తిళ్లు ఉన్నప్పటికీ వాణిజ్య భవనాలకు ఏడాదికి రూ.10 లక్షలకు మించి పన్ను విధించారు. గత ఏడాది అక్టోబరు నుంచే ప్రత్యేక డ్రైవ్‌ ప్రారంభించామని జిల్లా పంచాయతీ అధికారి ఎంఎన్‌వీ శ్రీనివాసరావు తెలిపారు. ప్రతి వారం లక్ష్యాలను నిర్దేశించడంతో 71 శాతం దాటామన్నారు. మార్చి నెలాఖరుకు 100 శాతం పన్ను వసూలు చేయాలని కార్యదర్శులను ఆదేశించామన్నారు.

Updated Date - Feb 26 , 2026 | 01:17 AM