ముగిసిన రెండో విడత నామినేషన్ల స్వీకరణ
ABN , Publish Date - Nov 21 , 2026 | 12:37 AM
జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా పెదబయలు, ముంచంగిపుట్టు, అనంతగిరి, జి.మాడుగుల మండలాల్లో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది.
నాలుగు మండలాల్లో సర్పంచులకు 693, వార్డులకు 1,793 దాఖలు
29న ఆయా పంచాయతీలకు ఎన్నికలు
పాడేరు, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా పెదబయలు, ముంచంగిపుట్టు, అనంతగిరి, జి.మాడుగుల మండలాల్లో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. ఈ నాలుగు మండలాల్లోని 87 పంచాయతీలు, 880 వార్డులకు సంబంధించి 34 నామినేషన్ల స్వీకరణ కేంద్రాల్లో మూడు రోజులుగా సర్పంచులకు 693, వార్డులకు 1,793 నామినేషన్లు దాఖలయ్యాయి. మండలాల వారీగా చూస్తే... ముంచంగిపుట్టులో సర్పంచులకు 150, వార్డులకు 384 నామినేషన్లు, పెదబయలులో సర్పంచులకు 206, వార్డులకు 470 నామినేషన్లు, అనంతగిరిలో సర్పంచులకు 179, వార్డులకు 478 నామినేషన్లు, జి.మాడుగుల మండలంలో సర్పంచులకు 158, వార్డులకు 310 నామినేషన్లు దాఖలయ్యాయని డీపీవో కేపీ.చంద్రశేఖర్, డీఎల్‌పీవో పీఎస్.కుమార్ తెలిపారు. జిల్లాలో రెండో విడత ఈనెల 29న ఎన్నికలు జరిగే ముంచంగిపుట్టులో 38,895 మంది, పెదబయలులో 43,322, అనంతగిరిలో 38,286, జి.మాడుగులలో 44,674 మంది ఓటర్లున్నారు.
రెండో విడత పంచాయతీ ఎన్నికలకు దాఖలైన నామినేషన్ల వివరాలు.....
-----------------------------------------------------------------------------------------------
వ.సం మండలం పేరు పంచాయతీలు వార్డులు సర్పంచ్‌లకు వార్డులకు
------------------------------------------------------------------------------------------------
1. ముంచంగిపుట్టు 23 228 150 384
2. పెదబయలు 23 232 206 470
3. అనంతగిరి 24 232 179 478
4. జి.మాడుగుల 17 118 158 310
-----------------------------------------------------------------------------------------------
మొత్తం 87 880 693 1,793