24 నుంచి స్కూల్ స్పోర్ట్స్ చాంపియన్‌షిప్ పోటీలు
ABN , Publish Date - Sep 19 , 2026 | 11:24 PM
జిల్లాలో ఈనెల 24 నుంచి అక్టోబరు 1వ తేదీ వరకు స్కూల్ స్పోర్ట్స్ చాంపియన్‌షిప్ పోటీలను నిర్వహిస్తున్నట్టు జిల్లా విద్యాశాఖాధికారి జి.భానుమూర్తి రాజు శనివారం ఒక ప్రకటనలో కోరారు.
పాడేరురూరల్, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఈనెల 24 నుంచి అక్టోబరు 1వ తేదీ వరకు స్కూల్ స్పోర్ట్స్ చాంపియన్‌షిప్ పోటీలను నిర్వహిస్తున్నట్టు జిల్లా విద్యాశాఖాధికారి జి.భానుమూర్తి రాజు శనివారం ఒక ప్రకటనలో కోరారు. అండర్-14, 17 విభాగాల్లో బాల, బాలికలకు కబడ్డీ, ఖో-ఖో, వాలీబాల్, షటిల్ బ్యాడ్మింటన్ పోటీలను నిర్వహించనున్నట్టు చెప్పారు. ఈ పోటీలను ఈనెల 24వ తేదీన పాఠశాల స్థాయిలోను, 25వ తేదీన మండల స్థాయిలో బాలురకు, 26న బాలికలకు, 28వ తేదీన నియోజకవర్గ స్థాయిలో బాలురకు, 29న బాలికలకు, 30వ తేదీన జిల్లా స్థాయిలో బాలురకు, అక్టోబరు 1వ తేదీన బాలికలకు నిర్వహిస్తామన్నారు. ఈనెల 24న పాఠశాలల హెచ్‌ఎంలు ఈ పోటీలను నిర్వహించి పాఠశాల స్థాయిలో అర్హులైన క్రీడాకారులను ఎంపిక చేసి, ఆ జాబితాను మండల స్పోర్ట్స్ కో-ఆర్డినేటర్‌కు అందించాలన్నారు. మండలంలో పోటీలను ఎంఈవోలు పకడ్బందీగా నిర్వహించాలన్నారు. మైదానం, న్యాయ నిర్ణేతలు, తాగునీరు, ప్రథమ చికిత్స ఏర్పాట్లు చేయాలన్నారు. ఎంపికైన జట్లను నియోజకవర్గ స్థాయి పోటీలకు పంపించాలన్నారు. ఉప విద్యాశాఖాధికారులు నియోజకవర్గ స్థాయిలో జరిగే పోటీలను పర్యవేక్షించాలన్నారు. అక్కడ ఎంపికైన క్రీడా జట్ల వివరాలను జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి నివేదించాలన్నారు. జిల్లా స్థాయిలో ఎంపికైన క్రీడా జట్లు రాష్ట్ర స్థాయి ఎస్‌జీఎఫ్ పోటీలకు జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తారని డీఈవో భానుమూర్తి రాజు తెలిపారు.