బడి ఎన్నికలకు మోగిన గంట
ABN , Publish Date - Sep 16 , 2026 | 01:06 AM
విద్యాలయాల్లోని పాఠశాల యాజమాన్య కమిటీల ఎన్నికలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ మేరకు మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈనెల 29 ఎస్‌ఎంసీ ఎన్నికలను నిర్వహించాలని పేర్కొంది. రెండేళ్ల కాలపరిమితితో ఉండే పాఠశాల యాజమాన్య కమిటీ (ఎస్‌ఎంసీ)లకు సంబంధించిన ఓటరు జాబితాను ఈనెల 18వ తేదీన ప్రదర్శించాలని, 25వ తేదీన అభ్యంతరాల స్వీకరణ, అదేరోజు సాయంత్రం 4 గంటలకు జాబితా ఖరారు చేసి ప్రదర్శించనున్నారు.
జిల్లాలో 2,034 విద్యాలయాల్లో
29న ఎస్‌ఎంసీ ఎన్నికలు
నోటిఫికేషన్, మార్గదర్శకాలు
విడుదల చేసిన సమగ్ర శిక్ష
పారదర్శకంగా ఎస్‌ఎంసీ
ఎన్నికలు: ఏపీసీ స్వామినాయుడు
పాడేరు, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి):
విద్యాలయాల్లోని పాఠశాల యాజమాన్య కమిటీల ఎన్నికలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ మేరకు మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈనెల 29 ఎస్‌ఎంసీ ఎన్నికలను నిర్వహించాలని పేర్కొంది. రెండేళ్ల కాలపరిమితితో ఉండే పాఠశాల యాజమాన్య కమిటీ (ఎస్‌ఎంసీ)లకు సంబంధించిన ఓటరు జాబితాను ఈనెల 18వ తేదీన ప్రదర్శించాలని, 25వ తేదీన అభ్యంతరాల స్వీకరణ, అదేరోజు సాయంత్రం 4 గంటలకు జాబితా ఖరారు చేసి ప్రదర్శించనున్నారు. అలాగే 29న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎస్‌ఎంసీ సభ్యుల ఎన్నిక, మధ్యాహ్నం 1.30 గంటలకు చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ ఎన్నిక నిర్వహించి, రెండు గంటలకు నూతన పాఠశాల యాజమాన్య కమిటీ తొలి సమావేశాన్ని నిర్వహిస్తారు.
ఈ ఏడాది మారిన మార్గదర్శకాలు
పాఠశాల యాజమాన్య కమిటీకి సంబంధించిన ఈఏడాది మార్గదర్శకాలను కాస్తా మార్చారు. విద్యార్థుల సంఖ్య ఆధారంగా సభ్యుల సంఖ్య ఉండాలనే నిబంధనను రూపొందించారు. దీంతో 100 మంది లోపు విద్యార్థులంటే 12 నుంచి 15 మంది సభ్యులు, 100 నుంచి 500 మంది ఉంటే 15 నుంచి 20 మంది సభ్యులు, 500 మంది పైబడి విద్యార్థులుంటే 20 నుంచి 25 మంది సభ్యులుండాలని సూచిస్తున్నారు. అలాగే మొత్తం కమిటీలో 75 శాతం పాఠశాలలోని విద్యార్థుల తల్లిదండ్రులుండాలని, మిగిలిన 25 శాతం ఉపాధాయులు, పంచాయతీ సభ్యులు, ఏఎన్‌ఎం, అంగన్‌వాడీ, ఆశ కార్యకర్తలుండాలి. మొత్తం కమిటీ సభ్యుల్లో 50 శాతం మహిళలుండాలనే నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలి.
పారదర్శకంగా ఎస్‌ఎంసీ ఎన్నికలు
ఏసీపీ స్వామినాయుడు
జిల్లాలోని 2,034 పాఠశాలల్లోనూ ఈనెల 29వ తేదీన పాఠశాల యాజమాన్య కమిటీల ఎన్నికలను పారదర్శకంగా నిర్వహిస్తామని సమగ్ర శిక్ష అసిస్టెంట్ ప్రాజెక్టు కో-ఆర్డినేటర్ డాక్టర్ వీఏ.స్వామినాయుడు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉన్నతాఽధికారుల ఆదేశాల మేరకు ఎస్‌ఎంసీ ఎన్నికల నిర్వహణలో పారదర్శకత, నిష్పక్షపాతం, ప్రశాంత వాతావరణం పాటించాలని, అన్ని పాఠశాలల్లోనూ నిర్దేశించిన నిబంధనలతో ఎన్నికలు జరగాలన్నారు. ఎస్‌ఎంసీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన మార్గదర్శకాలను శత శాతం పక్కాగా అమలు చేసి, ఎస్‌ఎంసీల ఎన్నికలను విజయవంతం చేయాలని స్వామినాయుడు పేర్కొన్నారు.