ఏడు మండలాలకు స్కూలు బ్యాగులు
ABN , Publish Date - Jul 19 , 2026 | 01:34 AM
జిల్లాలో 11 మండలాలకుగాను శనివారం నాటికి ఏడు మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం 38,511 బ్యాగులు వచ్చాయి.
విశాఖపట్నం, జూలై 18 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో 11 మండలాలకుగాను శనివారం నాటికి ఏడు మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం 38,511 బ్యాగులు వచ్చాయి. జిల్లాలోని 568 పాఠశాలల్లో గత విద్యా సంవత్సరం 69,279 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో విద్యార్థుల సంఖ్య 70 వేలకు చేరింది. ఈ నేపథ్యంలో మరో 30 వేలకుపైగా బ్యాగులు జిల్లాకు రావలసి ఉంది. నెలాఖరు నాటికి విద్యార్థులందరికీ బ్యాగులు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు తెలిపారు.