వారపు సంతకు సంక్రాంతి శోభ
ABN , Publish Date - Jan 08 , 2026 | 12:16 AM
మండల కేంద్రం వారపు సంతకు సంక్రాంతి శోభ సంతరించుకున్నది. బుధవారం సంక్రాంతికి ముందు సంత కావడంతో భారీ సంఖ్యలో గిరిజనులు తరలి వచ్చారు.
చింతపల్లి, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రం వారపు సంతకు సంక్రాంతి శోభ సంతరించుకున్నది. బుధవారం సంక్రాంతికి ముందు సంత కావడంతో భారీ సంఖ్యలో గిరిజనులు తరలి వచ్చారు. మైదాన ప్రాంతాలకు చెందిన దుస్తులు, ఫ్యాన్సీ, కిరాణా వర్తకులు ప్రత్యేక దుకాణాలను ఏర్పాటు చేశారు. ఆదివాసీలు పిండి వంటలకు కావాల్సిన కిరాణా, గృహాల అలంకరణకు వినియోగించే రంగులు, దుస్తుల దుకాణాల వద్ద అధికంగా కనిపించారు. సాయంత్రం వరకు సంత ప్రాంతం గిరిజనులు, వర్తకులతో రద్దీగా కనిపించింది