Share News

పారిశుధ్య కార్మికుల సమ్మె విరమణ

ABN , Publish Date - May 01 , 2026 | 11:08 PM

అరకులోయలో పారిశుధ్య కార్మికులు శుక్రవారం సమ్మె విరమించారు. పంచాయతీ అధికారులు, కార్మిక, గిరిజన సంఘాల నాయకులతో జరిగిన తాత్కాలిక ఒప్పందంతో సమ్మె విరమిస్తున్నట్టు సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరరావు, కార్మిక సంఘం నాయకులు అర్జున్‌, బుద్దులు తెలిపారు.

పారిశుధ్య కార్మికుల సమ్మె విరమణ
మాజీ సర్పంచ్‌ దాసుబాబు సమక్షంలో పంచాయతీ అధికారులతో తాత్కాలిక ఒప్పందం చేసుకున్న కార్మిక, గిరిజన సంఘ నాయకులు

పంచాయతీ అధికారులతో తాత్కాలిక ఒప్పందం

రెండు నెలల వేతనం చెల్లింపునకు అంగీకారం

పారిశుధ్య పనులు చేపట్టిన కార్మికులు

అరకులోయ, మే 1 (ఆంధ్రజ్యోతి): అరకులోయలో పారిశుధ్య కార్మికులు శుక్రవారం సమ్మె విరమించారు. పంచాయతీ అధికారులు, కార్మిక, గిరిజన సంఘాల నాయకులతో జరిగిన తాత్కాలిక ఒప్పందంతో సమ్మె విరమిస్తున్నట్టు సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరరావు, కార్మిక సంఘం నాయకులు అర్జున్‌, బుద్దులు తెలిపారు. కార్మికులకు తక్షణమే రెండు నెలల వేతనాలు చెల్లించడానికి, పలు సమస్యలు పరిష్కరించేందుకు లిఖితపూర్వకంగా పంచాయతీ అధికారులు ఇచ్చిన హామీ మేరకు సమ్మెను విరమించినట్టు తెలిపారు. శుక్రవారం నుంచి విధుల్లో చేరినట్టు వారు చెప్పారు. దీంతో ప్రధాన రహదారిపై పేరుకుపోయిన చెత్తకుప్పలను తొలగించారు. శనివారం నుంచి అన్ని వీధుల్లో చెత్తను తొలగించే పనులు చేయనున్నారు. పారిశుధ్య కార్మికులకు వేతన బకాయిలు చెల్లించాలని కోరారు.

Updated Date - May 01 , 2026 | 11:09 PM