Share News

స్థానిక సమరానికి సై

ABN , Publish Date - Oct 15 , 2026 | 12:50 AM

స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమైంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్‌ఈసీ) షెడ్యూల్‌ విడుదల చేయడంతో జిల్లా అంతటా ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎన్నికల కోడ్‌) తక్షణమే అమలులోకి వచ్చింది. జిల్లాలో నర్సీపట్నం, ఎలమంచిలి మునిసిపాలిటీలు, 24 జడ్పీటీసీ స్థానాలు, 427 ఎంపీటీసీ స్థానాలు, 642 గ్రామపంచాయతీలకు ఎస్‌ఈసీ ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఎన్నికలు నిర్వహించడానికి అధికార యంత్రాంగం ఏర్పాట్లను ముమ్మరం చేసింది.

స్థానిక సమరానికి సై

మునిసిపల్‌, ప్రాదేశిక, పంచాయతీల ఎన్నికలకు మోగిన నగారా

జిల్లాలో రెండు మునిసిపాలిటీలు, 24 జడ్పీటీసీలు, 427 ఎంపీటీసీలు, 642 పంచాయతీలు

షెడ్యూల్‌ విడుదలతో అమల్లోకి ఎన్నికల కోడ్‌

అనకాపల్లి, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి):

స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమైంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్‌ఈసీ) షెడ్యూల్‌ విడుదల చేయడంతో జిల్లా అంతటా ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎన్నికల కోడ్‌) తక్షణమే అమలులోకి వచ్చింది. జిల్లాలో నర్సీపట్నం, ఎలమంచిలి మునిసిపాలిటీలు, 24 జడ్పీటీసీ స్థానాలు, 427 ఎంపీటీసీ స్థానాలు, 642 గ్రామపంచాయతీలకు ఎస్‌ఈసీ ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఎన్నికలు నిర్వహించడానికి అధికార యంత్రాంగం ఏర్పాట్లను ముమ్మరం చేసింది.

తొలి విడత నర్సీపట్నం, ఎలమంచిలి పురపాలక సంఘాల్లో కౌన్సిలర్‌, చైర్‌పర్సన్‌ పదవులకు ఎన్నికలు జరుగుతాయి. వీటికి 16వ తేదీ నుంచి 18వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 19న నామినేషన్‌ పత్రాలను పరిశీలన, 20, 21 తేదీల్లో ఉపసంహరణ వుంటాయి, 21వ తేదీ సాయంత్రం ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాలను విడుదల చేస్తారు. 28న పోలింగ్‌ నిర్వహించి, 30న లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు.

పరిషత్‌ ఎన్నికలు...

జిల్లాలో 24 జడ్పీటీసీ స్థానాలు, 427 ఎంపీటీసీ స్థానాలు వున్నాయి. వీటి ఎన్నికలకు ఈనెల 19న నోటిఫికేషన్‌ విడుదల చేస్తారు. 21 నుంచి 23వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరిస్తారు. 24వ తేదీన నామినేషన్ల పరిశీలన, 25 నుంచి 27వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహర్‌ వుంటాయి. 27వ తేదీన పోటీలో వున్న అభ్యర్థుల జాబితాలను విడుదల చేస్తారు. నవంబరు 3న పోలింగ్‌, నవంబరు 5న ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి వుంటాయి..

మూడు దశల్లో పంచాయతీ పోరు...

జిల్లాలో గ్రామ పంచాయతీల సర్పంచ్‌, వార్డు సభ్యుల ఎన్నికలను మూడు విడతల్లో నిర్వహించనున్నారు. ప్రతి దశలోనూ మధ్యాహ్నం పోలింగ్‌ పూర్తవుతుంది. ఆ వెంటనే ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. జిల్లాలో 646 గ్రామ పంచాయతీలు ఉండగా రాంబిల్లి మండలంలోని నాలుగు పంచాయతీల్లో న్యాయపరమైన చిక్కులు కారణంగా ఎన్నికలు నిర్వహించడం లేదు. మిగిలిన 642 పంచాయతీల్లో మూడు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తారు. తొలి విడత నవంబరు 13న నోటిఫికేషన్‌, 15 నుంచి 17 వరకు నామినేష్ల స్వీకరణ, 18న పరిశీలన, 21 వరకు ఉపసంహరణ, అదే రోజు తుది జాబితా ప్రకటన, 26న ఎన్నికలు, ఓట్ల లెక్కింపు జరుగుతాయి.

రెండో విడత నవంబరు 16న నోటిఫికేషన్‌, 18 నుంచి 20 వరకు నామినేష్ల స్వీకరణ, 21న పరిశీలన, 24 వరకు ఉపసంహరణ, అదే రోజు తుది జాబితా ప్రకటన, 29న ఎన్నికలు, ఓట్ల లెక్కింపు జరుగుతాయి.

మూడో విడత నవంబరు 19న నోటిఫికేషన్‌, 21 నుంచి 23 వరకు నామినేష్ల స్వీకరణ, 24న పరిశీలన, 27 వరకు ఉపసంహరణ, అదే రోజు తుది జాబితా ప్రకటన, డిసెంబరు 2న ఎన్నికలు, ఓట్ల లెక్కింపు జరుగుతాయి.

అమల్లోకి ఎన్నికల కోడ్‌

రాష్ట్ర ఎన్నికల సంఘం మంగళవారం స్థానిక సంస్థ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించిన నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎన్నికల కోడ్‌) తక్షణమే అమలులోకి వచ్చింది. ఎన్నికల కోడ్‌ నిబంధనల ప్రకారం ప్రభుత్వ, ప్రైవేటు స్థలాల్లో ఉన్న రాజకీయ పార్టీలు/ నాయకుల ఫ్లెక్సీలు, పోస్టర్లు, బోర్డులను వెంటనే తొలగిస్తారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయకూడదు. ఇప్పటికే ప్రారంభించిన పనులు, అమలు చేస్తున్న పథకాలకు ఎన్నికల కోడ్‌ వర్తించదు. ఆయా పనులు, పథకాలను యథావిధిగా కొనసాగించవచ్చు.

మండలాల వారీగా రిజర్వేషన్‌

సంఖ్య మండలం జడ్పీటీసీ ఎంపీపీ

1. అనకాపల్లి జనరల్‌ బీసీ (మహిళ)

2. అచ్యుతాపురం జనరల్‌ (మహిళ) బీసీ

3. బుచ్చెయ్యపేట బీసీ (మహిళ) జనరల్‌

4. కశింకోట బీసీ (మహిళ) జనరల్‌

5. చోడవరం జనరల్‌ బీసీ

6. దేవరాపల్లి బీసీ (మహిళ) జనరల్‌

7. ఎలమంచిలి బీసీ జనరల్‌ (మహిళ)

8. కె.కోటపాడు జనరల్‌ బీసీ (మహిళ)

9. మునగపాక బీసీ (మహిళ) జనరల్‌

10. రాంబిల్లి జనరల్‌ (మహిళ) జనరల్‌

11. పరవాడ జనరల్‌ (మహిళ) బీసీ

12. సబ్బవరం జనరల్‌ (మహిళ) బీసీ

13. చీడికాడ బీసీ జనరల్‌ (మహిళ)

14. వి.మాడుగుల బీసీ ఎస్‌టీ (మహిళ)

15. గొలుగొండ ఎస్‌టీ బీసీ

16. కోటవురట్ల ఎస్‌సీ (మహిళ) జనరల్‌ (మహిళ)

17. మాకవరపాలెం జనరల్‌ బీసీ (మహిళ)

18. నక్కపల్లి ఎస్‌సీ జనరల్‌ (మహిళ)

19. నర్సీపట్నం బీసీ జనరల్‌ (మహిళ)

20. నాతవరం జనరల్‌ ఎస్‌టీ (మహిళ)

21. పాయకరావుపేట జనరల్‌ (మహిళ) ఎస్‌టీ

22. రావికమతం బీసీ (మహిళ) జనరల్‌ (మహిళ)

23. రోలుగుంట జనరల్‌ బీసీ (మహిళ)

24. ఎస్‌.రాయవరం జనరల్‌ (మహిళ) జనరల్‌

Updated Date - Oct 15 , 2026 | 12:50 AM