Share News

నేటి నుంచి సదరం శిబిరాలు

ABN , Publish Date - Mar 30 , 2026 | 12:50 AM

దివ్యాంగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం మరింత ఉదారంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటి వరకు 16 కేటగిరీల్లో వైకల్యం ఉన్న వారికి సదరం ధ్రువపత్రాలను జారీ చేస్తున్నది. ఇప్పుడు కొత్తగా మరో ఐదు రకాల రుగ్మతులను చేర్చి 21 కేటగిరీల్లో సదరం ధ్రువపత్రాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నది. వీరికి ఈ నెల 25వ తేదీ నుంచి సదరం స్లాట్‌ బుకింగ్‌కి అవకాశం కల్పించింది. స్లాట్‌ బుక్‌ చేసుకున్న వారికి సోమవారం నుంచి ఆయా జిల్లా ప్రభుత్వ ఆస్పత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో వైకల్యం నిర్ధారణ వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. మూడు నెలలపాటు ప్రతీ సోమ, మంగళవారాల్లో ఈ వైద్య శిబిరాలు వుంటాయి.

నేటి నుంచి సదరం శిబిరాలు
సదరం శిబిరంలో దివ్యాంగులు (ఫైల్‌ ఫొటో)

వారంలో రెండు రోజులపాటు నిర్వహణ

కొత్తగా మరో ఐదు రకాల వ్యాధుల చేర్పు

నేడు, రేపు ప్రభుత్వ ఆస్పత్రుల్లో తనిఖీలు

నర్సీపట్నం, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): దివ్యాంగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం మరింత ఉదారంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటి వరకు 16 కేటగిరీల్లో వైకల్యం ఉన్న వారికి సదరం ధ్రువపత్రాలను జారీ చేస్తున్నది. ఇప్పుడు కొత్తగా మరో ఐదు రకాల రుగ్మతులను చేర్చి 21 కేటగిరీల్లో సదరం ధ్రువపత్రాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నది. వీరికి ఈ నెల 25వ తేదీ నుంచి సదరం స్లాట్‌ బుకింగ్‌కి అవకాశం కల్పించింది. స్లాట్‌ బుక్‌ చేసుకున్న వారికి సోమవారం నుంచి ఆయా జిల్లా ప్రభుత్వ ఆస్పత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో వైకల్యం నిర్ధారణ వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. మూడు నెలలపాటు ప్రతీ సోమ, మంగళవారాల్లో ఈ వైద్య శిబిరాలు వుంటాయి.

సదరం సర్టిఫికెట్ల డిజిటలైజేషన్‌

ఇప్పటి వరకు 13 రకాల వైకల్యాలకు డిజిటలైజేషన్‌ రూపంలో, హేమోఫిలియా, సికిల్‌సెల్‌ ఎనీమియా, తలసీమియా జబ్బులకు మాన్యువల్‌ పద్ధతిలో.. మొత్తం 16 రకాల వైకల్యాలకు సదరం ధ్రువపత్రాలు జారీ చేసేవారు. ఇందుకోసం ప్రభుత్వం 2005 నుంచి ఉపయోగిస్తున్న పాత సాఫ్ట్‌వేర్‌తో తరుచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతుండడంతో దానిని పక్కన పెట్టింది. ప్రత్యేకంగా అత్యాధునిక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించింది. దీంతో మాన్యువల్‌ విధానంలో సర్టిఫికెట్ల జారీకి ప్రభుత్వం ఫుల్‌స్టాప్‌ పెట్టింది. కొత్తగా మరో ఐదు రకాల జబ్బులను చేర్చడంతో మొత్తం 21 రకాల వైకల్యాలకు సదరం సర్థిఫికెట్లు ఇవ్వడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. 40 శాతం వైకల్యాన్ని ప్రామాణికంగా తీసుకొని సదరం సర్టిఫికెట్‌ జారీ చేస్తారు. కొత్తగా చేర్చిన వ్యాధులలో రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌, స్పీచ్‌ అండ్‌ లాంగ్వేజ్‌ డిజెబిలిటీ (మాట సంబంధిత లోపాలు), స్పెసిఫిక్‌ లెర్నింగ్‌ డిజెబిలిటీ, ఆటిజం స్పెక్ట్రమ్‌ డిజాస్టర్‌, మల్టిపుల్‌ డిజార్డర్‌ (ఒకటి కంటే ఎక్కువ వైకల్యాలు) ఉన్నావారికి సదరం శ్లాట్‌ బుకింగ్‌కి అవకాశం కల్పించింది. జిల్లాలో ఈ తరహా జబ్బుల బాధితులు వెయ్యి మంది వరకు ఉంటారని అధికారుల భావిస్తున్నారు. ఈ సర్టిఫికెట్‌ కలిగి ఉన్నవారికి నెలవారీ పెన్షన్‌ అందడంతో పాటు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే వెసులుబాటు కలుగుతుంది.

వారంలో రెండు రోజులపాటు శిబిరాలు

రామకృష్ణ నాయుడు, సహిత విద్య కోఆర్డినేటర్‌, అనకాపల్లి (29ఎన్‌పీ2)

ప్రభుత్వం కొత్తగా చేర్చిన ఐదు రాకల జబ్బులతో కలుపుని మొత్తం 21 రకాల వైకల్యాలకు ప్రతి సోమ, మంగళవారాల్లో నిర్ధారణ పరీక్షలు చేస్తారు. సదరం సర్టిఫికెట్లను పాదర్శకంగా జారీ చేయడానికి కొత్త సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తున్నారు. స్లాట్‌ బుక్‌ చేసుకున్న వారు తమకు కేటాయించిన ఆస్పత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోవాలి.

Updated Date - Mar 30 , 2026 | 12:50 AM