గ్యాస్ కోసం పడిగాపులు
ABN , Publish Date - Apr 05 , 2026 | 12:45 AM
మండల కేంద్రంలో హెచ్‌పీ గ్యాస్ కోసం లబ్ధిదారులు శనివారం పడిగాపులు కాశారు.
మాకవరపాలెం, ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో హెచ్‌పీ గ్యాస్ కోసం లబ్ధిదారులు శనివారం పడిగాపులు కాశారు. రెండు వారాలుగా హెచ్‌పీ గ్యాస్ సిలిండర్ల సరఫరా లేకపోవడంతో లబ్ధిదారులు శనివారం ఉదయం నుంచి బారులుతీరారు. 150కి పైగా సిలిండర్లు పంపిణీ చేయాల్సి ఉండగా, సాయంత్రం అరకొరగా లబ్ధిదారులకు ఇచ్చి చేతులుదులిపేసుకున్నారు. కాగా గ్యాస్ సిలిండర్ బ్లాక్‌లో రూ.1,500 నుంచి రూ.1,700 వరకు అమ్ముతున్నారని, దీనిని అరికట్టడానికి అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు.