Share News

ఆర్టీసీకి తుఫాన్‌ నష్టం రూ.10 లక్షలు

ABN , Publish Date - Oct 30 , 2026 | 11:16 PM

పాడేరు ఆర్టీసీ డిపోకు ఆర్నబ్‌ తుఫాన్‌ నేపథ్యంలో రూ. 10 లక్షల 1 వేయి 84 నష్టం వాటిల్లిందని జిల్లా ప్రజారవాణా శాఖాధికారి ఎం.శ్యాంసుందర్‌ నాయుడు తెలిపారు.

ఆర్టీసీకి తుఫాన్‌ నష్టం రూ.10 లక్షలు
ప్రయాణీకులు లేక బోసిపోయిన పాడేరు ఆర్టీసీ డిపో

పాడేరురూరల్‌, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): పాడేరు ఆర్టీసీ డిపోకు ఆర్నబ్‌ తుఫాన్‌ నేపథ్యంలో రూ. 10 లక్షల 1 వేయి 84 నష్టం వాటిల్లిందని జిల్లా ప్రజారవాణా శాఖాధికారి ఎం.శ్యాంసుందర్‌ నాయుడు తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పాడేరు ఆర్టీసీ డిపో నుంచి ప్రతి రోజు వివిధ ప్రాంతాలకు 40 బస్సు సర్వీస్‌లను నడిపేవారమన్నారు. తుఫాన్‌ నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పాడేరు డిపో పరిధిలో 11 బస్సు సర్వీసులను ప్రయాణికుల భద్రత దృష్ట్యా 28వ తేదీ నుంచి నిలుపుదల చేశామన్నారు. కేవలం ప్రమాదం లేని రహదారుల్లో 7 నుంచి 8 బస్సు సర్వీస్‌లను మాత్రమే నడిపామన్నారు. తుఫాన్‌ ప్రభావం కారణంగా ఈనెల 27వ తేదీ నుంచే ప్రయాణికుల రద్దీ లేదన్నారు. అందువల్ల ఆర్టీసీకి 27వ తేదీన రూ. 56,216, 28వ తేదీ రూ. 3,76,223, 29వ తేదీ రూ. 5,68,644 మొత్తంగా రూ. 10,01,084 నష్టం వాటిల్లిందని ఆయన తెలిపారు.

Updated Date - Oct 30 , 2026 | 11:16 PM