Share News

పంచారామ పుణ్యక్షేత్రాలకు ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు

ABN , Publish Date - Nov 11 , 2026 | 01:04 AM

కార్తీక మాసంలో పంచారామ పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకునే భక్తుల కోసం ఆర్టీసీ అధికారులు నర్సీపట్నం డిపో నుంచి ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నారు. ప్రతి ఆదివారం సాయంత్రం ఏడు గంటలకు నర్సీపట్నం బస్‌ స్టేషన్‌ నుంచి అలా్ట్ర డీలక్స్‌ బస్సు బయలు దేరుతుందని డిపో మేనేజర్‌ ఆచారి తెలిపారు. సోమవారం అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామ, సామర్లకోటల్లోని పంచారామ క్షేత్రాల దర్శనం చేయించి, రాత్రికి తిరిగి నర్సీపట్నం తీసుకువస్తామని వెల్లడించారు.

పంచారామ పుణ్యక్షేత్రాలకు ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు

నర్సీపట్నం, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): కార్తీక మాసంలో పంచారామ పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకునే భక్తుల కోసం ఆర్టీసీ అధికారులు నర్సీపట్నం డిపో నుంచి ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నారు. ప్రతి ఆదివారం సాయంత్రం ఏడు గంటలకు నర్సీపట్నం బస్‌ స్టేషన్‌ నుంచి అలా్ట్ర డీలక్స్‌ బస్సు బయలు దేరుతుందని డిపో మేనేజర్‌ ఆచారి తెలిపారు. సోమవారం అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామ, సామర్లకోటల్లోని పంచారామ క్షేత్రాల దర్శనం చేయించి, రాత్రికి తిరిగి నర్సీపట్నం తీసుకువస్తామని వెల్లడించారు. టికెట్లను రిజర్వేషన్‌ కౌంటర్‌, ఆర్టీసీ వెబ్‌సైట్‌, ఆర్టీసీ అధీకృత ఏజెంట్ల వద్ద బుక్‌ చేసుకోవచ్చని తెలిపారు. పంచారామ పుణ్యక్షేత్రాల దర్శన యాత్రకు ఒక్కొక్క టికెట్‌ ధర రూ.1,470లుగా నిర్ణయించామన్నారు. కాగా కార్తీక మాసం సందర్భంగా వివిధ పుణ్యక్షేత్రాలు, విజ్ఞాన, విహార యాత్రలకు ప్రత్యేక ప్యాకేజీలతో ఆర్టీసీ సర్వీసులు అందిస్తామని తెలిపారు. కనీసం 50 మంది ప్రయాణికులు ఉంటే పల్లెవెలుగు, అలా్ట్ర పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌, ఆలా్ట్ర డీలక్స్‌ బస్సు సర్వీసులు సమకూరుస్తామని చెప్పారు. విహార యాత్రలకు వెళ్లే పాఠశాలు, కళాశాలల విద్యార్థులకు ప్యాకేజీలో 10 శాతం రాయితీ ఇస్తామని ఆయన వెల్లడించారు. శబరిమలై వెళ్లే అయ్యప్ప మాలధారులకు కూడా ప్రత్యేక బస్సు సర్వీసులు అందుబాటులోకి తెస్తామని ఆయన తెలిపారు.

Updated Date - Nov 11 , 2026 | 01:04 AM