Share News

ఆర్టీసీకి మహాశివరాత్రి ఆదాయం రూ.28 లక్షలు

ABN , Publish Date - Feb 20 , 2026 | 01:10 AM

మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కల్యాణపులోవ, ధారమఠం, పుణ్యగిరి ప్రాంతాలకు రెండు రోజులపాటు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపడం ద్వారా రూ.28 లక్షల ఆదాయం వచ్చిందని డీపీటీవో ప్రవీణ చెప్పారు.

ఆర్టీసీకి మహాశివరాత్రి ఆదాయం రూ.28 లక్షలు
డీపీటీవో ప్రవీణ

అనకాపల్లి, నర్సీపట్నం డిపోల నుంచి 104 సర్వీసులు

124 శాతం ఓఆర్‌

డీపీటీవో ప్రవీణ

అనకాపల్లి టౌన్‌, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కల్యాణపులోవ, ధారమఠం, పుణ్యగిరి ప్రాంతాలకు రెండు రోజులపాటు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపడం ద్వారా రూ.28 లక్షల ఆదాయం వచ్చిందని డీపీటీవో ప్రవీణ చెప్పారు.

గతేడాది రూ. 17 లక్షలు ఆదాయం వచ్చిందన్నారు. ఈ ఏడాది భక్తుల సంఖ్య కూడా పెరిగిందన్నారు. ఇందులో రూ.17 లక్షలు నర్సీపట్నం డిపో నుంచి, రూ.11 లక్షలు అనకాపల్లి డిపో నుంచి వచ్చినట్టు వెల్లడించారు. గత ఏడాది ఈ రెండు డిపోల నుంచి 89 బస్సులు నడపగా, ఈ ఏడాది 104 బస్సులు నడిపామని చెప్పారు. గత ఏడాది 61,810 మంది ప్రయాణించడంతో 96 శాతం ఓఆర్‌ వచ్చిందని, ఈ ఏడాది 88,705 మంది ప్రయాణించడంతో 124 శాతం ఓఆర్‌ వచ్చిందన్నారు. ఈ ఏడాది ప్రయాణికుల్లో 57,066 మంది మహిళలు, 31,639 మంది పురుషులు వున్నట్టు ఆమె చెప్పారు. మహిళలంతా స్ర్తీశక్తి పథకం కింద ఉచితంగా ప్రయాణించినట్టు వెల్లడించారు. అనకాపల్లి నుంచి విజయవాడకు కొత్తగా బస్సు సర్వీసును ప్రారంభించేందుకు, నర్సీపట్నం నుంచి హైదరాబాద్‌కు స్లీపర్‌ బస్సును నడిపేందుకు ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపినట్టు ఆమె చెప్పారు. జిల్లాలో ఓఆర్‌ వంద శాతం దాటిన రూట్లలో అదనపు బస్సులు నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు.

Updated Date - Feb 20 , 2026 | 01:10 AM