ఆర్టీసీ కాంప్లెక్స్ కిటకిట
ABN , Publish Date - Oct 22 , 2026 | 12:07 AM
దసరా సెలవులు ముగియడం, పాఠశాల, కళాశాలలు బుధవారం నుంచి పునఃప్రారంభం కావడంతో విద్యార్థులు, మైదాన ప్రాంతం నుంచి స్వగ్రామాలకు వచ్చిన ప్రజలు తిరుగు ప్రయాణమయ్యారు.
తిరుగు ప్రయాణికులతో రద్దీ
దసరా సెలవులు ముగియడంతో గ్రామాల నుంచి వెనుదిరుగుతున్న విద్యార్థులు
పాడేరురూరల్, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): దసరా సెలవులు ముగియడం, పాఠశాల, కళాశాలలు బుధవారం నుంచి పునఃప్రారంభం కావడంతో విద్యార్థులు, మైదాన ప్రాంతం నుంచి స్వగ్రామాలకు వచ్చిన ప్రజలు తిరుగు ప్రయాణమయ్యారు. దీంతో పాడేరులోని ఆర్టీసీ కాంప్లెక్స్, ప్రైవేటు జీపుల స్టాండ్‌లు బుధవారం ఉదయం నుంచి రద్దీగా మారాయి. విశాఖ, అనకాపల్లి, గుంటూరు, చోడవరం, విజయవాడ తదితర ప్రాంతాల్లో చదివే విద్యార్థినీ, విద్యార్థులు, అలాగే మన్యంలోని వివిధ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో, కళాశాలల్లో చదివే విద్యార్థులు, ఉద్యోగులు దసరా సెలవులకు స్వగ్రామాలకు వచ్చి తిరిగి వెళ్లేందుకు ఆర్టీసీ కాంప్లెక్స్, ప్రైవేటు జీపుల స్టాండ్ వద్దకు రావడంతో రద్దీ నెలకొంది.