కిటకిటలాడిన ఆర్టీసీ కాంప్లెక్స్
ABN , Publish Date - Jan 10 , 2026 | 10:54 PM
పాడేరు ఆర్టీసీ కాంప్లెక్సు ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. శనివారం నుంచి పాఠశాలలు, కళాశాలలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించడంతో విద్యార్థులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి స్వగ్రామాలకు వెళ్లే వారితో ఆర్టీసీ కాంప్లెక్స్, ప్రైవేటు జీపులు, ఆటోల స్టాండ్‌లు ప్రయాణికులతో రద్దీగా మారాయి.
సంక్రాంతి సెలవులతో పెరిగిన ప్రయాణికుల రద్దీ
అదనంగా సర్వీసులు నడుతున్న ఆర్టీసీ
అయినా రద్దీ తగ్గకపోవడంతో
మరిన్ని సర్వీసులు వేసిన అధికారులు
పాడేరురూరల్, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): పాడేరు ఆర్టీసీ కాంప్లెక్సు ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. శనివారం నుంచి పాఠశాలలు, కళాశాలలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించడంతో విద్యార్థులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి స్వగ్రామాలకు వెళ్లే వారితో ఆర్టీసీ కాంప్లెక్స్, ప్రైవేటు జీపులు, ఆటోల స్టాండ్‌లు ప్రయాణికులతో రద్దీగా మారాయి. ఆర్టీసీ కాంప్లెక్సులోకి బస్సులు వచ్చిన వెంటనే నిండిపోతున్నాయి. ప్రయాణికుల రద్దీతో ఇప్పటికే ఆరు అదనపు సర్వీసులను ఆర్టీసీ అధికారులు నడుపుతున్నా రద్దీ ఇంకా పెరుగుతునే ఉంది. దీంతో మరిన్ని అదనపు సర్వీసులు నడిపేందుకు ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకున్నారు. శనివారం నుంచి పెదబయలు, ముంచంగిపుట్టు రూట్‌లో మరో రెండు సర్వీసులను నడుపుతున్నామని పాడేరు ఆర్టీసీ డిపో మేనేజర్ పసగాడ శ్రీనివాసరావు తెలిపారు. అదేవిధంగా కాంప్లెక్స్‌లో ప్రయాణికుల రద్దీని గుర్తించి అత్యవసర ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు. సురక్షిత ప్రయాణానికి ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.