Share News

‘మాడుగుల’ రోడ్ల మరమ్మతుకు రూ.7.89 కోట్లు

ABN , Publish Date - Mar 04 , 2026 | 12:54 AM

గ్రామీణ ప్రాంతాల్లో ఆర్‌ అండ్‌ బి రహదారుల మరమ్మతుల పనులకు జిల్లా వ్యాప్తంగా రూ. 20.66 కోట్లు మంజూరు చేయగా మాడుగుల నియోజకవర్గంలో ఆర్‌అండ్‌బీ పరిధిలోని పలు రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం రూ.7.89 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలోని ఆర్‌అండ్‌బీ రహదారుల మరమ్మతు పనులకు మొత్తం రూ.20.66 కోట్లు మంజూరుకాగా, ఇందులో 38 శాతం నిధులు ఒక్క మాడుగుల నియోజకవర్గానికే కేటాయించడం గొప్ప విషయమని అన్నారు.

‘మాడుగుల’ రోడ్ల మరమ్మతుకు రూ.7.89  కోట్లు
బండారు సత్యనారాయణమూర్తి, ఎమ్మెల్యే

ఆర్‌అండ్‌బీకి మంజూరు చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు

ఎమ్మెల్యే బండారు వెల్లడి

కె.కోటపాడు, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంతాల్లో ఆర్‌ అండ్‌ బి రహదారుల మరమ్మతుల పనులకు జిల్లా వ్యాప్తంగా రూ. 20.66 కోట్లు మంజూరు చేయగా మాడుగుల నియోజకవర్గంలో ఆర్‌అండ్‌బీ పరిధిలోని పలు రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం రూ.7.89 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలోని ఆర్‌అండ్‌బీ రహదారుల మరమ్మతు పనులకు మొత్తం రూ.20.66 కోట్లు మంజూరుకాగా, ఇందులో 38 శాతం నిధులు ఒక్క మాడుగుల నియోజకవర్గానికే కేటాయించడం గొప్ప విషయమని అన్నారు.

చీడికాడ మండలం వరహాపురం నుంచి విజయరామరాజుపేట వరకు, చోడవరం నుంచి చీడికాడ వరకు 13.84 కిలోమీటర్ల రహదారికి రూ.3 కోట్లు, బీఎన్‌ రోడ్డులో విజయరామరాజుపేట నుంచి చీడికాడ మండలం కోనాం వరకు 14.4 కిలోమీటర్ల రోడ్డుకు రూ.2.85 కోట్లు, మాడుగుల బ్రాంచ్‌ రోడ్డు 3.785 కిలోమీటర్లకు రూ.60 లక్షలు, సబ్బవరం నుంచి కె.కోటపాడు మీదుగా కొత్తవలస వరకు 5.8 కిలోమీటర్ల రోడ్డు రూ.40 లక్షలు మంజూరైనట్టు బండారు చెప్పారు. వడ్డాది-గొటివాడ 8.4 కిలోమీటర్ల రోడ్డుకు రూ.40 లక్షలు, గవరవరం-కాశీపురం మధ్య 3.47 కిలోమీటర్ల రోడ్డు రూ.25 లక్షలు, రావికతం-కింతలి మధ్య 3.25 కిలోమీటర్ల రోడ్డుకు రూ.6 లక్షలు, మాడుగుల- దబ్బగుంట- కేజే పురం మధ్య 4.5 కిలోమీటర్ల రోడ్డుకు రూ.5 లక్షలు, దేవరాపల్లి మండలం పెదకోట-పినకోట మధ్య 4.5 కిలోమీటర్ల రోడ్డుకు రూ.5 లక్షలు, పెదగోగాడ- తురువోలు మధ్య 7.486 కిలోమీటర్ల రోడ్డుకు రూ.5 లక్షలు, కింతలి- వమ్మిలి మధ్య మూడు కిలోమీటర్ల రోడ్డుకు రూ.5 లక్షలు, వడ్డాది- కింతలి మధ్య మూడు కిలోమీటర్ల రోడ్డుకు రూ.9 లక్షలు, చీడికాడ మండలం కోనాం- మంచాల మధ్య 7.6 కిలోమీటర్ల రోడ్డుకు రూ.5 లక్షలు, వెంకన్నపాలెం రోడ్డు నుంచి ఆనందపురం వరకు 3.9 కిలోమీటర్లకు రూ.5 లక్షలు మంజూరైనట్టు ఆయన తెలిపారు.

Updated Date - Mar 04 , 2026 | 12:54 AM