Share News

రెండేళ్లలో ‘నర్సీపట్నం’ అభివృద్ధి, సంక్షేమానికి రూ.1,100 కోట్లు

ABN , Publish Date - Jun 13 , 2026 | 12:29 AM

కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ రెండేళ్లలో నర్సీపట్నం నియోజకవర్గంలో సంక్షేమం, అభివృద్ధి పనులకు సుమారు రూ.1,100 కోట్ల రూపాయలు వెచ్చించినట్టు స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు.

రెండేళ్లలో ‘నర్సీపట్నం’ అభివృద్ధి, సంక్షేమానికి రూ.1,100 కోట్లు
చినగొలుగొండపేట సభలో మాట్లాడుతున్న అయ్యన్నపాత్రుడు

స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు

2029లో రాజకీయాలకు గుడ్‌బై చెప్పనున్నట్టు ప్రకటన

నాతవరం, జూన్‌ 12 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ రెండేళ్లలో నర్సీపట్నం నియోజకవర్గంలో సంక్షేమం, అభివృద్ధి పనులకు సుమారు రూ.1,100 కోట్ల రూపాయలు వెచ్చించినట్టు స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. శుక్రవారం అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గ పరిధిలోని నాతవరం మండలం చినగొలుగొండపేట గ్రామంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని నాయకులు విజయోత్సవ సభ ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన స్పీకర్‌ మాట్లాడుతూ వచ్చే మూడేళ్లలో మరో 1,100 కోట్ల రూపాయలు నర్సీపట్నం నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ పనులకు ఖర్చు చేయనున్నట్టు చెప్పారు. తాను 2029లో రాజకీయాలకు గుడ్‌బై చెప్పనున్నట్టు ఈ సందర్భంగా పేర్కొన్నారు. అనంతరం నియోజకవర్గంలో నాలుగు మండలాల రైతులకు స్పీకర్‌ వరి విత్తనాలు పంపిణీ చేశారు.

Updated Date - Jun 13 , 2026 | 12:29 AM