బాధితులకు మొబైల్ ఫోన్ల అందజేత
ABN , Publish Date - Apr 02 , 2026 | 12:10 AM
జిల్లా పోలీస్ శాఖ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ప్రజల ఆస్తుల రక్షణే ధ్యేయంగా పనిచేస్తోందని, ఇందులో భాగంగా బుధవారం పోలీస్ కార్యాలయంలో మొబైల్ రికవరీ మేళాను విజయవంతంగా నిర్వహించామని జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ తెలిపారు.
విజయవంతంగా మొబైల్ రికవరీ మేళా
పాడేరురూరల్, ఏప్రిల్ 1(ఆంధ్రజ్యోతి): జిల్లా పోలీస్ శాఖ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ప్రజల ఆస్తుల రక్షణే ధ్యేయంగా పనిచేస్తోందని, ఇందులో భాగంగా బుధవారం పోలీస్ కార్యాలయంలో మొబైల్ రికవరీ మేళాను విజయవంతంగా నిర్వహించామని జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ తెలిపారు. గత ఏడాది అక్టోబరు 29వ తేదీ నుంచి ఈ ఏడాది జనవరి 5వ తేదీ వరకు బాధితులు పోగొట్టుకున్న రూ 7 లక్షల విలువైన 65 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు ఎస్పీ అమిత్ బర్దార్ స్వయంగా అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేవలం అల్లూరి జిల్లాలోనే కాకుండా పొరుగు జిల్లాలైన తూర్పుగోదావరి, విశాఖపట్నం, విజయనగరం, విజయవాడ, ఖమ్మం తదితర జిల్లాలతో పాటు ఒడిశా, తమిళనాడు, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, తెలంగాణ రాష్ట్రాల నుంచి కూడా 65 మొబైల్ ఫోన్లను జిల్లా పోలీస్ యంత్రాంగం రికవరీ చేసిందన్నారు. రికవరీ మేళాలో బాధితుల కళ్లల్లో ఆనందం చూడడం సంతృప్తినిచ్చిందన్నారు. మొబైల్ పోయినప్పుడు బాధితులు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఠీఠీఠీ.ఛ్ఛిజీట.జౌఠి.జీుఽ వెబ్‌సైట్‌లో లాస్ట్ మొబైల్ ఆప్షన్‌లో ఐఎంఈఐ నంబర్, ఫోన్ మోడల్ వివరాలను నమోదు చేస్తే చాలన్నారు. ఈ విధానాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. మొబైల్ ఫోన్ల రికవరీలో కృషి చేసిన ఎస్‌ఐ ఎస్‌కే సాదిక్, హెచ్‌సీ బి.నాగేశ్వరరావు, బి.కనకరాజు, బి.సత్యనారాయణ, పీసీ హరివిష్ణు, పీసీ పి.రవికుమార్‌లను ఆయన అభినందించారు.