పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
ABN , Publish Date - Mar 11 , 2026 | 11:29 PM
మన్యంలో రోజు రోజుకు కనిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. అయితే పాడేరు మొదలుకుని అన్ని మండలాల్లోనూ బుధవారం ఉదయం తొమ్మిది గంటల వరకు దట్టంగా పొగమంచు కురిసింది.
అరకులోయలో 15.3 డిగ్రీలు
ఉదయం 9 గంటల వరకు వీడని పొగమంచు
పాడేరు, మార్చి 11(ఆంధ్రజ్యోతి): మన్యంలో రోజు రోజుకు కనిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. అయితే పాడేరు మొదలుకుని అన్ని మండలాల్లోనూ బుధవారం ఉదయం తొమ్మిది గంటల వరకు దట్టంగా పొగమంచు కురిసింది. బుధవారం అరకులోయలో 15.3, ముంచంగిపుట్టులో 15.6, పెదబయలులో 16.4, చింతపల్లిలో 16.5, జి.మాడుగులలో 18.3, కొయ్యూరులో 18.5, అనంతగిరిలో 22.1 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.