Share News

పెరుగుతున్న గరిష్ఠ ఉష్ణోగ్రతలు

ABN , Publish Date - Apr 04 , 2026 | 11:19 PM

మన్యంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. తెల్లవారుజామున మాత్రం పొగమంచు కురుస్తూ తర్వాత నుంచి ఎండ ప్రభావం చూపుతున్నది.

పెరుగుతున్న గరిష్ఠ ఉష్ణోగ్రతలు
పాడేరులో శనివారం ఉదయం పొగమంచు

కొయ్యూరులో 37.2 డిగ్రీలు

కొనసాగుతున్న పొగమంచు

పాడేరు, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): మన్యంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. తెల్లవారుజామున మాత్రం పొగమంచు కురుస్తూ తర్వాత నుంచి ఎండ ప్రభావం చూపుతున్నది. కొన్ని రోజులుగా వాతావరణంలోని మార్పులతో పొగమంచు, ఎండ, వర్షం సైతం కురుస్తున్నది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు సైతం క్రమంగా పెరుగుతుండడంతో పగటి వేళల్లో ఎండ ప్రభావం చూపుతున్నది. ఏజెన్సీలో శనివారం కొయ్యూరులో 37.2 డిగ్రీల సెల్సియస్‌గా గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదుకాగా అనంతగిరిలో 34.8, జి.మాడుగులలో 34.4, చింతపల్లిలో 33.4, అరకులోయలో 32.9, ముంచంగిపుట్టులో 31.3, పెదబయలులో 31.1 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Updated Date - Apr 04 , 2026 | 11:19 PM