Share News

విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు

ABN , Publish Date - May 22 , 2026 | 12:07 AM

కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత మంత్రి నారా లోకేశ్‌ సారథ్యంలో విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకున్నాయని, టెన్త్‌ విద్యార్థుల కోసం నిర్వహించిన వంద రోజుల ప్రణాళికలు సత్ఫలితాలనిచ్చాయని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. గురువారం స్థానికంగా వున్న క్యాంపు కార్యాలయం వద్ద నియోజకవర్గంలోని టెన్త్‌ ప్రతిభావంతులకు హోం మంత్రి అనిత తన సొంత నిధులతో కలెక్టర్‌ విజయ్‌ కృష్ణన్‌తో కలిసి నగదు పురస్కారాలను అందజేశారు.

విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు
ప్రతిభావంతులకు జ్ఞాపిక, నగదు పురస్కారాన్ని అందజేస్తున్న హోం మంత్రి అనిత, కలెక్టర్‌ విజయకృష్ణన్‌

- హోం మంత్రి అనిత

- టెన్త్‌ ప్రతిభావంతులకు నగదు పురస్కారం

నక్కపల్లి, మే 21 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత మంత్రి నారా లోకేశ్‌ సారథ్యంలో విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకున్నాయని, టెన్త్‌ విద్యార్థుల కోసం నిర్వహించిన వంద రోజుల ప్రణాళికలు సత్ఫలితాలనిచ్చాయని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. గురువారం స్థానికంగా వున్న క్యాంపు కార్యాలయం వద్ద నియోజకవర్గంలోని టెన్త్‌ ప్రతిభావంతులకు హోం మంత్రి అనిత తన సొంత నిధులతో కలెక్టర్‌ విజయ్‌ కృష్ణన్‌తో కలిసి నగదు పురస్కారాలను అందజేశారు. నియోజకవర్గం పరిధిలో 103 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికీ రూ.5వేలు చొప్పున అందజేశారు. నగదు బహుమతితో పాటు పిల్లలకు శాలువా, మెమెంటోలు అందజేసి ఆశీస్సులు అందజేశారు. జిల్లాలో అత్యధిక మార్కులు సాధించిన 12 మంది విద్యార్థులను కూడా మంత్రి సత్కరించి నగదు పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ విద్యారంగంలో భవిష్యత్తులో ఏపీ అంతర్జాతీయ ప్రమాణాలు దిశగా దూసుకువెళుతుందని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వం విద్యార్థులకు నాసిరకం బ్యాగులను ఇచ్చిందని ఆరోపించారు. పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు ఆడ, మగ అనే తేడా చూడకూడదని, వారి ప్రవర్తనపై తల్లిదండ్రులు నిరంతరం పర్యవేక్షణ జరపాలని సూచించారు. చట్టాలపై విద్యార్థి దశ నుంచే అవగాహన వుండాలని, ప్రతీ విద్యార్థికి ఒక స్పష్టమైన లక్ష్యం వుండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారులు, పలు మండలాలకు చెందిన ఎంఈవోలు, సీనియర్‌ హెచ్‌ఎంలు, నియోజకవర్గం నాలుగు మండలాలకు చెందిన కూటమి నాయకులు పాల్గొన్నారు.

Updated Date - May 22 , 2026 | 12:07 AM