డిప్యూటీ సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన
ABN , Publish Date - Mar 13 , 2026 | 01:04 AM
డిప్యూటీ సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన
- పాడేరు మండలంలోని ఓనూరు, నందిగరువు గ్రామాల్లో పర్యటించనున్న పవన్‌కల్యాణ్
పాడేరురూరల్, మార్చి 12(ఆంధ్రజ్యోతి): పాడేరు నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ఈ నెల 14న పర్యటించనున్న నేపథ్యంలో దీనికి సంబంధించిన ఏర్పాట్లను గురువారం పాడేరు ఆర్డీవో, పోలీస్ ఉన్నతాధికారులు పరిశీలించారు. పవన్‌కల్యాణ్ మండలంలోని ఓనూరు, నందిగరువు గ్రామాల్లో పర్యటించనున్న నేపథ్యంలో ఐటీడీఏ ఏపీవో ఎం.వెంకటేశ్వరరావు, డీఎస్పీ అభిషేక్, ఇన్‌చార్జి ఆర్డీవో ఎంవీఎస్ లోకేశ్వరరావు, ఉప ముఖ్యమంత్రి పర్సనల్ సెక్రటరీ మధు, జిల్లా అధికారులు ఏర్పాట్లను పరిశీలించారు. ఉప ముఖ్యమంత్రి పర్యటించే మార్గాలు, సభాప్రాంగణం, హెలీప్యాడ్ వద్ద కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని పోలీసు అధికారులకు ఐటీడీఏ ఏపీవో, ఇన్‌చార్జి ఆర్డీవో సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌అండ్‌బీ, రెవెన్యూ, పంచాయతీరాజ్, మెడికల్ అండ్ హెల్త్, విద్యుత్, డీఆర్‌డీఏ పీడీ, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.