Share News

సంక్రాంతి నాటికి రీ సర్వే ప్రక్రియ పూర్తి

ABN , Publish Date - Jan 06 , 2026 | 11:28 PM

పెండింగ్‌లో ఉన్న మ్యుటేషన్‌, రీ సర్వే ప్రక్రియలను సంక్రాంతి నాటికి పూర్తి చేయాలని రెవెన్యూ అధికారులను కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ ఆదేశించారు.

సంక్రాంతి నాటికి రీ సర్వే ప్రక్రియ పూర్తి
వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్న కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌

పెండింగ్‌లో ఉన్న మ్యుటేషన్‌ కూడా..

అధికారులకు కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌ ఆదేశం

పాడేరు, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): పెండింగ్‌లో ఉన్న మ్యుటేషన్‌, రీ సర్వే ప్రక్రియలను సంక్రాంతి నాటికి పూర్తి చేయాలని రెవెన్యూ అధికారులను కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ ఆదేశించారు. రంపచోడవరం నుంచి రెవెన్యూ అధికారులతో మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ముఖ్యంగా పెండింగ్‌లో ఉన్న భూ సంబంధ సమస్యలపై ఆర్‌డీవోలతో కమిటీ వేసి తక్షణమే పరిష్కరించాలన్నారు. ఈ క్రమంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై శాఖాపరమైన చర్యలు చేపడతామని ఆయన హెచ్చరించారు. పీజీఆర్‌ఎస్‌కు వచ్చిన ఫిర్యాదులు వెంటనే పరిష్కరించాలని, రీ సర్వే ప్రక్రియలో గ్రామ సరిహద్దులలో ఉన్న సంబంధిత శాఖ భూములకు నోటీసులు ఇవ్వాలన్నారు. అటవీ, రెవెన్యూ సమస్యలు ఉన్న గ్రామాల్లో సంబంధిత ఫారెస్టు అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ పూర్తి కావాలని, పీఎం జన్‌మన్‌ ఇళ్లు సకాలంలో పూర్తి అయ్యేలా చూడాలన్నారు. ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు సకాలంలో బిల్లుల చెల్లింపులు చేయాలని, ఇళ్ల లబ్ధిదారులకు అవసరమైన స్థలాలను మంజూరు చేయాలన్నారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ప్రభుత్వ రాయితీలు, ఇతర సదుపాయాలు కల్పించాలన్నారు. పీజీఆర్‌ఎస్‌లో వినతుల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పాడేరు, రంపచోడవరం, చింతూరు ఐటీడీఏల పీవోలు శ్రీపూజ, స్మరణ్‌రాజ్‌, శుభం నొక్యాల్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ సాహిత్‌, డీఆర్‌వో పి.అంబేడ్కర్‌, ఆర్‌డీవో ఎంవీఎస్‌.లోకేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 06 , 2026 | 11:28 PM