Share News

రిజర్వ్‌ ఫారెస్టు భూ సమస్య పరిష్కారం

ABN , Publish Date - Oct 13 , 2026 | 12:05 AM

ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్‌)లో అందిన ఫిర్యాదు మేరకు జాయింట్‌ కలెక్టర్‌ టి.శ్రీపూజ మండలం లోని రంగశీల పంచాయతీలో సోమవారం పర్యటించారు.

రిజర్వ్‌ ఫారెస్టు భూ సమస్య పరిష్కారం
రంగశీల పంచాయతీ ప్రజలతో మాట్లాడుతున్న జాయింట్‌ కలెక్టర్‌ శ్రీపూజ

రంగశీల పంచాయతీలో జేసీ శ్రీపూజ పర్యటన

పీజీఆర్‌ఎస్‌లో అందిన ఫిర్యాదు మేరకు విచారణ

హుకుంపేట, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్‌)లో అందిన ఫిర్యాదు మేరకు జాయింట్‌ కలెక్టర్‌ టి.శ్రీపూజ మండలం లోని రంగశీల పంచాయతీలో సోమవారం పర్యటించారు. రిజర్వ్‌ ఫారెస్టు భూముల సమస్యపై క్షేత్రస్థాయి విచారణ జరిపారు. రంగశీల పంచాయతీలోని రంగశీల, కొర్ర, పాతకోట, సిమిలిగూడ గ్రామాల మధ్య రిజర్వ్‌ ఫారెస్టు భూములకు సంబంధించి తలెత్తిన సమస్యపై ఆయా గ్రామస్థులతో చర్చించారు. వారితో మాట్లాడిన అనంతరం సమస్యను పరిష్కరించారు.

భూ రీసర్వే పనుల పరిశీలన

మండలంలోని రంగశీల పంచాయతీ పరిధిలోని చినబురుగుపుట్టు గ్రామంలో జరుగుతున్న భూముల రీసర్వే పనులను జేసీ పరిశీలించారు. సర్వే నిర్వహణ విధానం, భూముల వివరాల నమోదు, సంబంధిత భూ యజమానులకు సమాచారం అందించే ప్రక్రియ, తదితర అంశాలపై ఆరా తీశారు. రీసర్వేలో పూర్తి కచ్చితత్వం పాటించాలని అధికారులకు సూచించారు. సర్వే సమయంలో భూముల హద్దులు, విస్తీర్ణం, ఇతర సంబంధిత వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి, ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా రీసర్వే ప్రక్రియను చేపట్టాలని ఆదేశించారు. భూ యజమానులకు ముందస్తు నోటీసులు అందించాలని సూచించారు. సర్వే సమయంలో గ్రామ సర్వేయర్‌, వీఆర్వో తప్పనిసరిగా ఉండాలని ఆమె ఆదేశించారు.

Updated Date - Oct 13 , 2026 | 12:05 AM