Share News

రిజర్వాయర్లు కళకళ

ABN , Publish Date - Nov 26 , 2026 | 12:08 AM

మాచ్‌ఖండ్‌ జల విద్యుత్‌ కేంద్రానికి నీరందించే డుడుమ, జోలాపుట్టు ప్రధాన జలాశయాలు నిండుకుండలా ఉన్నాయి.

రిజర్వాయర్లు కళకళ
నీటితో కళకళలాడుతున్న జోలాపుట్టు జలాశయం

నిండుకుండలా జోలాపుట్టు, డుడుమ జలాశయాలు

ముంచంగిపుట్టు, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): మాచ్‌ఖండ్‌ జల విద్యుత్‌ కేంద్రానికి నీరందించే డుడుమ, జోలాపుట్టు ప్రధాన జలాశయాలు నిండుకుండలా ఉన్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వాగులు, గెడ్డ పాయల నుంచి వరద నీరు ఎక్కువగా రావడంతో జలాశయాలు కళకళలాడుతున్నాయి. జోలాపుట్టు జలాశయంలో 2,750 అడుగుల నీటిని నిల్వ ఉంచే సామర్థ్యం ఉండగా, బుధవారం 2744.65 అడుగుల నీటిమట్టం నమోదైంది. అలాగే డుడుమ జలాశయంలో 2,590 అడుగుల నీటిని నిల్వ ఉంచే సామర్థ్యం ఉండగా, ప్రస్తుతం 2,581.60 అడుగులు నీటిమట్టం నమోదైంది. ఇక్కడ నుంచి దిగువ ప్రాంతంలో ఉన్న బలిమెలకు 1,300 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అలాగే విద్యుదుత్పాదనకు అవసరమైన నీటిని సరఫరా చేస్తున్నామని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల వలన ఈ ఏడాది విద్యుదుత్పాదనకు నీటి సమస్య తలెత్తే అవకాశం లేదని వారు పేర్కొన్నారు.

Updated Date - Nov 26 , 2026 | 12:08 AM