ఎంపీటీసీలకు రిజర్వేషన్లు ఖరారు
ABN , Publish Date - Oct 15 , 2026 | 12:48 AM
జిల్లాలో ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ విజయకృష్ణన్ బుధవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 427 ఎంపీటీసీ స్థానాలు వుండగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల మేరకు జిల్లాను యూనిట్‌గా తీసుకొని రిజర్వేషన్లు ఖరారు చేశారు. చెప్పినట్టుగానే బీసీలకు 36.3 శాతం కేటాయించి పెద్ద పీట వేశారు. కేటగిరీల వారీగా పరిశీలిస్తే.. ఎస్టీలకు 11 కేటాయించగా వీటిలో మహిళలకు 3, జనరల్ 8 వున్నాయి.
మొత్తం 427 స్థానాల్లో బీసీలకు 155 కేటాయింపు
ఎస్సీలకు 40, ఎస్టీలకు 11..
అనకాపల్లి, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ విజయకృష్ణన్ బుధవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 427 ఎంపీటీసీ స్థానాలు వుండగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల మేరకు జిల్లాను యూనిట్‌గా తీసుకొని రిజర్వేషన్లు ఖరారు చేశారు. చెప్పినట్టుగానే బీసీలకు 36.3 శాతం కేటాయించి పెద్ద పీట వేశారు. కేటగిరీల వారీగా పరిశీలిస్తే.. ఎస్టీలకు 11 కేటాయించగా వీటిలో మహిళలకు 3, జనరల్ 8 వున్నాయి. ఎస్సీలకు 40 కేటాయించగా వీటిలో 13 మహిళలకు, 27 జనరల్‌కు కేటాయించారు. బీసీలకు 155 రిజర్వు చేయగా, వీటిలో మహిళలకు 76, జనరల్‌కు 79 కేటాయించారు. అన్‌రిజర్వుడ్ 221 ఎంపీటీసీ స్థానాల్లో మహిళలకు 115 రిజర్వు చేశారు. 106 స్థానాలు అన్రిజర్వుడ్లో వుంచారు.