Share News

ప్రాదేశిక ఎన్నికలకు రీ షెడ్యూల్‌

ABN , Publish Date - Oct 29 , 2026 | 01:37 AM

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల షెడ్యూల్‌ను రీషెడ్యూల్‌ చేస్తూ బుధవారం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు నవంబరు ఐదో తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ నిర్వహిస్తారు. ఏడో తేదీ ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది.

ప్రాదేశిక ఎన్నికలకు రీ షెడ్యూల్‌

5న జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు,

7న మండల కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు

పక్కాగా ఏర్పాట్లు

జడ్పీటీసీ స్థానాలకు 13 మంది, 52 ఎంపీటీసీ స్థానాలకు 117 మంది పోటీ

జాయింట్‌ కలెక్టర్‌ విద్యాధరి

విశాఖపట్నం, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి):

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల షెడ్యూల్‌ను రీషెడ్యూల్‌ చేస్తూ బుధవారం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు నవంబరు ఐదో తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ నిర్వహిస్తారు. ఏడో తేదీ ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది.

పక్కాగా ఏర్పాట్లు

జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు పక్కాగా ఏర్పాట్లు చేశామని రిటర్నింగ్‌ అధికారి, జాయింట్‌ కలెక్టర్‌ జి.విద్యాధరి తెలిపారు. బుధవారం విలేకరులతో ఆమె మాట్లాడుతూ జిల్లాలో నాలుగు జడ్పీటీసీ స్థానాలు, 52 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయన్నారు. జడ్పీటీసీ స్థానాలకు 13 మంది, 52 ఎంపీటీసీ స్థానాలకు 117 మంది పోటీలో ఉన్నారన్నారు. మొత్తం 203 కేంద్రాల్లో ఎన్నికల నిర్వహణకు సిబ్బంది నియామకం పూర్తిచేశామన్నారు. ఓట్ల లెక్కింపు ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్‌ కళాశాలలో చేపట్టాలని తొలుత భావించామని, స్థానికంగా నిర్వహించాలని తాజాగా నిర్ణయం తీసుకున్నామన్నారు. భీమిలి, పద్మనాభం మండలాలకు చెందిన జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల ఓట్ల లెక్కింపు భీమిలి సీదార్‌ పాఠశాలలో, ఆనందపురం మండలంలోని జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు ఆనందపురం తహశీల్దారు కార్యాలయంలో, పెందుర్తి జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు అక్కడి జూనియర్‌ కళాశాలలో చేపడతామన్నారు. ఒక్కొక్క ఎంపీటీసీ స్థానానికి ఒక టేబుల్‌ వంతున మొత్తం 52 టేబుళ్లు ఏర్పాటుచేస్తున్నట్టు చెప్పారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ బ్యాలెట్‌ పేపర్లను వేరు చేసి కట్టలు కట్టడానికి మూడు గంటల సమయం పడుతుందని, అనంతరం ఓట్ల లెక్కింపు నాలుగు రౌండ్లలో పూర్తవుతుందన్నారు.

Updated Date - Oct 29 , 2026 | 01:37 AM